CBN: కుప్పంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును కుప్పంలో ఓడించడానికి వైసీపీ ఎప్పటి నుండో వ్యూహాలు రచిస్తుంది. అలాగే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరిగిన స్థానిక ఎన్నికలో వైసీపీ చాల విజయం సాధించింది. అందుకే వచ్చే ఎన్నికల్లో కుప్పం నుండి చంద్రబాబు నాయుడు గెలుస్తాడా అన్నా చర్చ మొదలైంది. అయితే కుప్పంలో చంద్రబాబు నాయుడు యొక్క గెలుపుకు గల కారణాల కోసం వైసీపీ ఎప్పటి నుండో వెతుకుతుంది. అలా వెతుకుతున్న వైసీపీకి ఇప్పుడు ఒక బలమైన విషయం తెలిసింది. బాబు యొక్క గెలుపుకు కుప్పంలో ఉన్న బోగస్ ఓట్లే కారణమని వైసీపీ నాయకులు తెల్సుకున్నట్టు సమాచారం. అందుకే ఇప్పుడు ఆ బోగస్ ఓట్లను తొలగించడానికి వైసీపీ ఏర్పాట్లు చెయ్యడం మొదలు పెట్టింది. ఈ బోగస్ ఓట్లను తొలగించడానికి ఫామ్ 7 ను ఉపయోగించడానికి వైసీపీ ప్రయత్నాలు మొదలు పెట్టిందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.

ఎన్ని బోగస్ ఓట్లున్నాయో తెలుసా!!
కుప్పంలో బాబు గెలుపుకు బోగస్ ఓట్లే కారణమని అనుకుంటున్న వైసీపీ ఆ ఓట్లను తొలగించడానికి ఫామ్ 7 ను ఉపయోగించడానికి వైసీపీ సిద్ధమైంది. అయితే కుప్పంలో మొత్తం 30వేల బోగస్ ఓట్లు ఉన్నాయని వైసీపీ నాయకులు అంచనా వేస్తున్నారు. బోగస్ ఓట్లు అంటే చనిపోయినా వాళ్లకు ఇంకా ఓటు హక్కు ఉంటడం, వేరే ప్రాంతంలో స్థిరపడ్డవారికి ఇంకా వాళ్ళ పాత అడ్రస్ లోనే ఇంకా ఓటు హక్కు ఉంటె వాటినే బోగస్ ఓట్లని అంటారు. అయితే వాటిని తొలగించడానికి ఫామ్ 7 అవకాశాన్ని ఎన్నికల సంఘం కలిపిస్తుంది. దీన్ని వాడుకుంటూ కుప్పం నియోజకవర్గంలో ఉన్న బోగస్ ఓట్లను తొలగించడానికి వైసీపీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. అయితే గతంలో టీడీపీ కూడా వైసీపీ బలంగా ఉన్న నియోజకవర్గాల్లో బోగస్ ఓట్లను తొలగించడానికి ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు వైసీపీ కూడా అదే చేస్తుంది.
బాబుకు ఓటమి తప్పదా!!
కుప్పం నుండి చంద్రబాబు నాయుడు వరుసగా ఏడుసార్లు గెలిచారు. వచ్చే ఎన్నికల్లో కూడా చంద్రబాబు నాయుడు మళ్ళీ ఇక్కడి నుండే పోటీ చెయ్యనున్నారు. అయితే ఇప్పుడు ఈ బోగస్ ఓట్లను తొలగించే పని పెట్టుకుంది కాబట్టి వచ్చే ఎన్నికల్లో గెలవడం టీడీపీకి కష్టం కానుంది. అయితే అక్కడ ఒకవేళ చంద్రబాబు నాయుడు ఓడిపోతే టీడీపీ పరువు మొత్తం పోతది. కాబట్టి ఇప్పుడు కుప్పంలో గెలవడం టీడీపీకి పరువుకు సంబంధించిన విషయంగా మారింది. ఈ బోగస్ ఓట్ల తొలగించే వైసీపీ పనిలో పడింది కాబట్టి వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు రెండు చోట్ల పోటీ చేస్తాడేమో చూడాలి.