CBN: చంద్రబాబు నాయుడు ఇప్పుడు కేవలం అధికారం కోసం తప్ప, ప్రజల గురించి ఆలోచించడం లేదు. 2019 ఎన్నికల్లో వచ్చిన ఓటమిని బాబు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే ఇప్పుడు అధికారం కోసం ఇష్టమొచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు. చివరికి ప్రజల ప్రాణాలతో కూడా రాజకీయాలు చెయ్యడానికి వెనుకాడటం లేదు. మొన్న కందుకూరులో కేవలం తన బలాన్ని నిరూపించుకోవడానికి చిన్న మీటింగ్ పెట్టి, 8మంది చావుకు కారణమయ్యారు. ఇలా మీటింగ్ లో జరుగుతున్నా మరణాలను అరికట్టడానికి వైసీపీ ప్రభుత్వం జీవో1 అనే ఒక చట్టాన్ని త్వరలోనే అమలులోకి తెస్తామని ప్రకటించింది. ఈ చట్ట ప్రకారం రోడ్లపై, జాతీయ రహదారులపై, చిన్న చిన్న సందుల్లో మీటింగ్ కానీ సభలు కానీ పెట్టరాదని, అధికారుల అనుమతి లేకుండా మీటింగ్స్ పెట్టరాదని నియమాలు పెట్టారు. అయితే దీనిపై టీడీపీ, జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్షాల నోరు నొక్కడానికే వైసీపీ ఇలా చేస్తుందని ఆరోపిస్తున్నారు.
కుప్పంలో బాబు ఆగ్రహం
కుప్పంలో ప్రచారానికి వెళ్లినా చంద్రబాబును పోలీసులు అడ్డుకున్నారు. దింతో ఆయన అక్కడే రోడ్ పై కూర్చోని నిరసన తెలిపారు. పోలీసులు హద్దుదాటి ప్రవర్తిస్తున్నారని, వీళ్ళు ఇలా ప్రవర్తించడానికి సైకో సీఎం జగన్మోహన్ రెడ్డియే కారణమని తెలిపారు. తన నియోజకవర్గంలో తానూ పర్యటించడానికి పోలీసులు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదని, తన ప్రజలను కల్వకుండా అడ్డుకోవడానికి పోలీసులు ఎందుకు ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు ప్రభుత్వం చేతుల్లో కీలుబొమ్మల్లా మారారని, వాళ్ళు చెప్పినట్టు ఆడుతున్నారని, పోలీసులను చూస్తుంటే తనకు జాలీ వేస్తుందని వెల్లడించారు. పోలీసులు ఇలానే ప్రవర్తిస్తే, ప్రజలు తిరగబడుతారని, వైసీపీ వాళ్లకు లేని రూల్స్ తమకు ఎందుకని బాబు ప్రశ్నించారు.
చంపితే ఎలా బాబు!!
సభలను, మీటింగ్ లను చిన్న చిన్న సందుల్లో పెట్టుకుంటూ, ఎక్కువమంది జనం తన సభకు వచ్చారని చెప్పుకోవడానికి బాబు చేసిన ప్రయత్నంలో ఎనిమిది మంది చనిపోయారని, ఇలా బాబు తన బలాన్ని చూపించుకోవడానికే ఇష్టమొచ్చినట్టు ప్రజలను చంపుతూ ఉంటె తాము చూస్తూ ఊరుకోమని వైసీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జీవో1 రూల్స్ వైసీపీ నాయకులకు కూడా వర్తిస్తుందని, వాటిని తాము కూడా పాటిస్తామని వైసీపీ పెద్దలు వెల్లడించారు. తామేమి ప్రతిపక్షాల నోర్లు నొక్కడం లేదని, ప్రజల ప్రాణాల కోసం తాము అలోచించి, ఈ నిర్ణయం తీసుకున్నామని వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ప్రజల ప్రాణాలు పోతున్నా కూడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుకు ఎలా మద్దతు తెలుపుతున్నారో తమకు అర్థం కావడం లేదని, బాబు చేసే తప్పులను కప్పిపుచ్చడానికి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టారని, కందుకూరులో జరిగిన సంఘటనపై పవన్ ఎందుకు చంద్రబాబు నాయుడును ప్రశ్నించడం లేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు.