Rahul Gandhi: రాహుల్ విషయంలో బీజేపీకి వైసీపీ సహాయం చేస్తుందా!!

Arjun

Rahul Gandhi:కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు కాంగ్రెస్ ను తొక్కడానికి వచ్చిన ఏ చిన్న అవకాశాన్ని కూడా బీజేపీ నాయకులు వదులుకోరు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుడు ఐన రాహుల్ గాంధీపై బీజేపీ నాయకులు విరుచుకుపడటానికి సిద్ధమయ్యారు.

is ysrcp supporting bjp in the issue of rahul gandhi?

రాహుల్ గాంధీ యొక్క ఉనికిని దెబ్బతియ్యడానికి బీజేపీ నాయకులు ఇప్పుడు ఇతర పార్టీ నాయకులను కూడా వాడుకుంటున్నారు. అలా బీజేపీ వాడుకుంటునన్ పార్టీల్లో ఇప్పుడు వైసీపీ కూడా చేరింది.

రాహుల్ పై పడ్డ విజయ్ సాయి రెడ్డి

రాహుల్ గాంధీ సీఎన్ఎన్ జర్నలిస్టు అయిన తన స్నేహితురాలి పెళ్లికి నేపాల్ కు వెళ్లగా, అక్కడి వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఆ పార్టీలో నేపాల్‌లోని చైనా దౌత్యవేత్త యహంకీ ఉన్నారని, ప్రచారం జరిగింది. ఈ అంశంపై విజయసాయిరెడ్డి ట్వీట్ చేస్తూ….. చైనా హనీ ట్రాప్‌లకు పాల్పడుతున్న సమయంలో యోహంకీతో రాహుల్ ఇలా ఉండటం ఏమిటని ట్వీట్ చేశారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్థాయిలో అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీకి వైసీపీ భయపడిందా!!

విజయ్ సాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున దుమారం రేగింది. వైసీపీ నాయకులు బీజేపీకి భయపడి కాంగ్రెస్ నాయకులపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని కాంగ్రెస్ నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ చెప్పినట్టు చేస్తున్నప్పుడు రెండు పార్టీలు పొత్తు పెట్టుకోవచ్చు కదా ఈ దాగుడుమూతలు ఎందుకని కాంగ్రెస్ నాయకులు, వైసీపీ నాయకులకు ప్రశ్నలు సంధిస్తున్నారు.

 

 

- Advertisement -