YSRCP:వైసీపీ కవరింగ్ రాజకీయాలు ప్రారంభించిందా!!

Arjun

YSRCP:వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడానికి ఆయన పట్టు విడవకుండా ప్రయత్నించిన తీరు, వైసీపీ ప్రకటించిన సంక్షేమ పథకాలే కారణం. వైఎస్ జగన్ ఇచ్చిన హామీలకు ప్రజలు ఆకర్షితులై వైసీపీకి అధికారం ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ సంక్షేమ పథకాలే వైసీపీ శాపంగా మారాయి. అప్పుడు ఎన్నికల్లో గెలవడానికి ఇష్టమొచ్చిన హామీలన్నీ వైసీపీ ఇచ్చింది.

Is ysrcp trying to cover up their mistakes in the distribution of government schemes

వాటి అమలు గురించి ఆలోచించకుండా ఇచ్చిన హామీలను ఇప్పుడు అమలు చెయ్యలేక వైసీపీ ప్రభుత్వం ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటుంది. అర్థులైనా కూడా తమకు సంక్షేమ పథకాలు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు.

వైసీపీ కవరింగ్ రాజకీయం

వచ్చే ఎన్నికల్లో గెలవడానికి వేసిన వ్యూహాల్లో “గడప గడపకు వైసీపీ” కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం ద్వారా ప్రజలకు దగ్గర కావొచ్చని భావించిన వైసీపీ నాయకులకు ప్రజల నుండి అవమానాలు ఎదురవుతున్నాయి. తాము అర్హులమైనప్పటికీ తమకు పథకాల నుండి లబ్ది పొందటం లేదని, వైసీపీకి చెందిన వారికే పథకాల లబ్ది పొందుతున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యాఖ్యలను వైసీపీ నాయకులు స్టయిల్ గా కవర్ చేసుకుంటున్నారు. అర్హులైన వారికి పథకాలు వర్తిస్తాయని, తమను అడిగిన ప్రజలు పథకాలకు అర్హులు కాదని , అందుకే వాళ్లకు పథకాల నుండి లబ్ది పొందలేకపోయ్యారని కవర్ చేస్తున్నారు. ఇలాంటి చీప్ రాజకీయాలు చెయ్యడం వైసీపీ నాయకులకు కొత్తేమి కాదు. ఇప్పటికే చాల పథకాలు అమలుకు సాధ్యం ఆపేశారు.

ప్రజల నుండి వ్యతిరేకత

వైసీపీ అధికారంలోకి వస్తే తమ భవిష్యత్తు మారుతుందని భావించిన ప్రజలు, ఇప్పుడు వైసీపీ పాలన చూసి షాక్ అవుతున్నారు. వైసీపీ ఓటు వేసి తప్పు చేశామని ఫీల్ అవుతున్నారు. కరెంటు కోతలు, రోడ్లు సరిగ్గా లేకపోవడం, విపరీతంగా నిత్యావసర వస్తువుల ధరలు పెరగడం, సంక్షేమ పథకాలు వైసీపీ వాళ్లకు మాత్రమే ఇవ్వడం వాళ్ళ ప్రజలు జగన్ ప్రభుత్వంపై కోపంగా ఉన్నారు. ఈ వ్యతిరేకత వచ్చే ఎన్నికల వరకు పెరుగుతుందో, లేక వైసీపీ వ్యూహం మార్చి మళ్ళీ ప్రజలంజ్ తమ వైపు తిప్పుకుంటుందో వేచి చూడాలి.

- Advertisement -