ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పై నారా లోకేష్ మండిపడ్డారు. ఎన్నికల ముందు జగన్ రెడ్డి పాదయాత్రలో మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న పిల్లలకు మేనమామగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కానీ ఎన్నికల తరువాత జగన్ రెడ్డి మెంటల్ మామగా తయారయ్యి పిల్లలను, తల్లిదండ్రులను వేధిస్తున్నారు. దేశమంతా పరీక్షలు వద్దు, ప్రాణాలే ముద్దు అంటున్నారు.మెంటల్ మామ మాత్రం పరీక్షలు ముద్దు,ప్రాణాలు అంటే లెక్కలేదు అంటున్నారు. విద్యార్థులు,తల్లిదండ్రుల ప్రాణాలతో చెలగాటం ఆడటం మంచిది కాదని దేశ ప్రధాని మోదీ గారితో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరీక్షలు రద్దు చేసారు. దేశంలో ఏపీ, అస్సాం మినహా సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇలతో పాటు అన్ని రాష్ట్రాలు ఇప్పటివరకు 10, 11, 12 తరగతులకు పరీక్షలను రద్దు చేశాయి. తమిళనాడులో ఈ నెల 6న పరీక్షలు రద్దు చేశారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మన రాష్ట్రంలో విద్యార్థులు,తల్లిదండ్రులు తీవ్రమైన మానసిక ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటి వరకు 18.20 లక్షల కరోనా కేసులు,12,052 మంది చనిపోయారు. అందులో దాదాపు 600 మంది ఉపాధ్యాయులు ఉండటం బాధాకరం. పాజిటివ్ రేట్ ఇంకా 6% ఉంది అని ప్రభుత్వమే ప్రకటించింది. వ్యాక్సినేషన్ నత్తనడకగా సాగుతోంది. రెండో డోస్ వేసే పరిస్థితి లేదు. మే మాసంలో ఏపీలో ప్రభుత్వం ప్రకటించిన దాని కంటే 5 రెట్లు ఎక్కువగా చనిపోయారని జాతీయ స్థాయిలో స్క్రోల్.ఇన్ అనే వెబ్ సైట్ ప్రకటించింది. క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే తాడేపల్లి మెంటల్ మామ మాత్రం పరీక్షలు పెట్టి పిల్లలు,తల్లితండ్రుల ప్రాణాలు తీస్తా అని అంటున్నారు.పరీక్షలు పెట్టకపోతే విద్యావ్యవస్థ మొత్తం కుప్పకూలుతుంది అని లెక్చర్ ఇస్తున్నారు.నీతి ఆయోగ్ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో నాణ్యమైన విద్య అందించడంలో స్టేట్ ర్యాంక్ 19 వ స్థానానికి పడిపోయింది. చంద్రబాబు గారి హయాంలో 3వ స్థానంలో ఉన్నాం.
మెంటల్ మామ చర్యలతో ఏపీలో నాణ్యమైన విద్య లేకుండా పోయింది. పదో తరగతి పిల్లలకు ట్రిపుల్ ఐటిలో అడ్మిషన్లకు ఇబ్బంది అవుతుంది అని ప్రభుత్వ వాదన.పోయిన ఏడాది మాదిరిగానే ఆర్జియూకేటి ప్రవేశ పరీక్ష ద్వారానే అడ్మిషన్లు చెప్పట్టారు. ఈ ఏడాది కూడా అలానే చెయ్యొచ్చు. పదో తరగతి పిల్లలకు సమ్మేటివ్ ఎగ్జామ్స్ నిర్వహించారు. వాటిని ఆధారంగా చేసుకొని గ్రేడింగ్ ఆధారంగా విద్యార్థులను పాస్ చెయ్యాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.

ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండా ఎంసెట్ ద్వారా అడ్మిషన్లు చెయ్యలేం అని ప్రభుత్వం అంటుంది. కానీ ఇంటర్ మార్కులకు వెయిటేజ్ రద్దు చేసి ఎంసెట్ ర్యాంకింగ్ ఆధారంగా అడ్మిషన్లు చెయ్యొచ్చు. పక్క రాష్ట్రం తెలంగాణ ఇదే విధానం అమలు చేస్తోంది. ఇప్పటికే పై తరగతులకు ఆన్ లైన్ క్లాసులు ప్రారంభమైయ్యాయి. పరీక్షల కోసం ప్రిపేర్ అవ్వాలా? పై తరగతుల క్లాసులకు అటెండ్ అవ్వాలో తెలియక విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారిని చూస్తే జాలేస్తుంది. ఏ రోజు ఎం మాట్లాడతారో ఆయనకే తెలియదు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 16, 2021 at 8:00 సా.