గతఎన్నికల్లో గెలవడానికి జగన్మోహన్ రెడ్డి యువశక్తిని తన వైపు తిప్పుకోవడానికి వారిని నమ్మించడానికి, అడ్డగోలుగా హామీలిచ్చాడని, ముఖ్యమంత్రయ్యాక ఆయన జాబ్ కేలండర్ తో యువతకు వెన్నుపోటు పొడిచాడని టీడీపీ లోక్ సభ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు స్పష్టంచేశారు. ఆదివారం ఆయన తన నివాసం నుంచి జూమ్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
ఆ వివరాలు ఆయన మాటల్లోనే క్లుప్లంగా మీకోసం…!
పాదయాత్రసమయంలో 2.30లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీచేస్తానని జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. ముఖ్యమంత్రి అయినే వెంటనే ఒకేసారి ప్రభుత్వఖాళీలన్నింటినీ భర్తీచేసి, నిరుద్యోగులను ఉద్ధరిస్తానన్నాడు. ప్రతిఏటా జనవరి 1న జాబ్ కేలండర్ విడుదలచేస్తానన్నాడు. మెగా డీఎస్సీతో 26వేల ఉద్యోగాలను ఒకేసారిపూరిస్తానన్నాడు. ప్రత్యేక హోదాతోనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయని చెప్పికూడా యువతను నమ్మించాడు. ప్రతిపక్షనేతగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, ప్రత్యేకహోదాతోనే ఉద్యోగాల విప్లవంవస్తుందన్నాడు. ఆనాడు అన్నిహామీలిచ్చిన జగన్మోహన్ రెడ్డి, నేడుముఖ్యమంత్రయ్యాక ఒక్కదాన్ని నెరవేర్చలేదు. జగన్మోహన్ రెడ్డి 151 ఎమ్మెల్యేసీట్లు గెలవడానికి ప్రధానకారణం ఆయన యువతకుఇచ్చిన హామీలే. యవతీయువకులు, ఆయన్నినమ్మారుకాబట్టే, ఆయన గెలపుకుసహకరించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రయ్యాక అలాంటియువతను దారుణంగా వంచించాడు. జగన్ ముఖ్యమంత్రయ్యాక డీఎస్సీలోని 26వేల ఖాళీలను ఎందుకుభర్తీచేయలేదు? 2.30 లక్షలఉద్యోగాలిస్తామని నమ్మించి, 10వేల143 పోస్టులతో జాబ్ లెస్ క్యాలెండర్ విడుదలచేయడం యువతను నట్టేటముంచడమే. పోలీస్ శాఖలో 7వేల ఖాళీలుంటే, జాబ్ కేలండర్లో 450 ఉద్యోగాలు భర్తీచేస్తానని చెప్పడం నిరు ద్యోగులను మోసగించడంకాదా? పోలీస్ శాఖలో పదిశాతం ఉద్యోగాలనుకూడా భర్తీచేయలేని దుస్థితిలో జగన్ ప్రభుత్వముందా? అలానే గ్రూప్ -1, గ్రూప్-2లో 3వేలకు పైగా ఖాళీలుంటే, కేవలం 36ఉద్యోగాలు ప్రకటించడం వంచించడంకాదా? లక్షలాది మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ యువతీయువకులు, గ్రూప్ -1, గ్రూప్ -2 ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నారు.

ఫేక్ పబ్లిసిటీతో ముఖ్యమంత్రి కాలం గడుపుతున్నాడు       

సంవత్సరాలనుంచి కోచింగ్ లపేరుతో వేలరూపాయల సొమ్ముని ఖర్చు చేస్తున్నారు. గ్రూప్ -1, 2 కింద 36ఉద్యోగాలుప్రకటించకుండా, వాలంటీర్ పోస్టులమాదిరే మీకు, మీరే మీకుఅనుకూలమైనవారితో వాటిని నింపేస్తే సరిపోయేదికదా? మూడు ప్రాంతాలకు 12 చొప్పున వాటిని పంచేయాల్సింది. యువతపై పగబట్టి, వారిని మానసికంగా చిత్రహింసలకు గురిచేయడానికే ముఖ్యమంత్రి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టుంది తప్ప, ఎక్కడా మాటనిలుబెట్టుకోవడానికి చేసినట్టుగా లేదు.
4.77లక్షల ఉద్యోగాలు ఇచ్చామని మే31న ప్రకటించిన ప్రభుత్వం. జూన్ 18నతిరిగి 6లక్షల03వేల ఉద్యోగాలి చ్చామని ప్రకటించడం ఫేక్ పబ్లిసిటీకాదా? జగన్మోహన్ రెడ్డి 20 రోజుల్లోనే లక్షా25వేలమందికి ఉద్యోగాలిచ్చాడా? ఫేక్ పబ్లిసిటీతో ముఖ్యమంత్రి ఇంకెంతకాలం యువతను, ప్రజలను మోసగిస్తాడు? ముఖ్యమంత్రి చెప్పుకుంటున్న 6లక్షల03వేల ఉద్యోగాల్లో 2లక్షల59వేల వాలంటీర్ ఉద్యోగా లున్నాయి. వారివి ప్రభుత్వఉద్యోగాలని సీఎం చట్టపరంగా ఎలా చెబుతారు? వాలంటీర్లు అంతా సహాయకులేనని ముఖ్యమంత్రే చెప్పారుకదా? వారికిచ్చేది జీతంకాదు.. గౌరవవేతనమని కూడా ఆయనేచెప్పారు. అలాచెప్పిన వారే, 2లక్షల59వేల ఉద్యోగాలను, ప్రభుత్వ ఉద్యోగాలని ఎలాచెబుతారు? 2లక్షల59వేలుపోతే, మిగిలినవి 3లక్షల 44వేల ఉద్యోగాలు. వాటిలో 95వేల మంది ఔట్ సోర్సింగ్ సిబ్బంది ఉన్నారు. వారు ప్రభుత్వ ఉద్యోగులా? ఔట్ సోర్సింగ్ విభాగంలో తరతరాలనుంచి సిబ్బంది నియా మకాలు జరుగుతున్నాయి. ప్రభుత్వశాఖలు వాటి అవసరా లను దృష్టిలో ఉంచుకొని, ఔట్ సోర్సింగ్ సిబ్బందిని నియమించుకుంటున్నాయి. వైసీపీప్రభుత్వం వచ్చాక ఏపీ ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ అని ఒకటి ఏర్పాటుచేసి, ఏదో కొత్తగా 95వేలమందిని నియమించినట్టు చెప్పడం మామూలుమోసం కాదు. 3లక్షల44వేలలో, 95వేల ఉద్యోగాలు పోతే, 2లక్షల49వేలు మిగిలాయి. వాటిలో ఏపీఎస్ ఆర్టీసీలో ఏళ్లతరబడి పనిచేస్తున్న 58వేల మందిని ప్రభుత్వఉద్యోగులుగాచూపారు. ప్రభుత్వంలో విలీనం చేస్తే,ఆర్టీసీలోని సిబ్బంది అంతా ప్రభుత్వ ఉద్యోగుల వుతారా? ప్రభుత్వంతరుపున వారికి అందాల్సిన సౌకర్యాలు, ప్రయోజనాలన్నీ ఈ ముఖ్యమంత్రి అందిస్తు న్నాడా? ఆర్టీసీసిబ్బందికిచెందిన 58వేలు తీసేస్తే మిగిలింది లక్షా91వేలు. కోవిడ్ పరిస్థితులకోసం నియమించిన 26వేలమంది తాత్కాలికమేననిగతంలోచెప్పి, ఇప్పుడు వారినికూడా ప్రభుత్వఉద్యోగులంటారా? కోవిడ్ నిమిత్తం నియమించిన వైద్య, వైద్యేతర సిబ్బందికి ఈనాటికీ సరిగా జీతాలు ఇవ్వడంలేదు. మంత్రలు, కలెక్టరేట్ల ఎదుటచాలామంది ధర్నాలుకూడాచేశారు. ఉద్యోగభద్రత కల్పించకుండా, జీతాలివ్వకుండా 26వేలమందికి ప్రభుత్వ ఉద్యోగాలిచ్చామంటారా? లక్షా 91వేలఉద్యోగాల్లో 26వేలు తీసేస్తే, మిగిలింది లక్షా65వేలు ఉద్యోగాలు. వాటిలో లక్షా 21వేలుసచివాలయ ఉద్యోగాలే ఉన్నాయి. మండలస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు సచివాలయసిబ్బందిని నియమించిన ప్రభుత్వం, ప్రభుత్వఉద్యోగులు చేస్తున్న పనినే, తిరిగివారితోచేయిస్తోంది. సచివాలయాల్లో పనిచేస్తున్నవారంతా ఎప్పుడెప్పుడుప్రభుత్వ ఉద్యోగాల నోటిఫికేషన్ వస్తుందాఅని ఎదురుచూస్తున్నారని ఎంపీ రామ్మోహన్ నాయుడు అన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 27, 2021 at 4:28 సా.