Pawan Kalyan: ఏపీలో ఇప్పుడు జగన్ కు ప్రతిపక్షాల నాయకులైన పవన్, చంద్రబాబుల మధ్య రాజకీయ పోరాటం ఏ రేంజ్ లో జరుగుతుందో అందరికి తెలుసు. ఈ ముగ్గురు నేతలు కనీసం ఒక్కసారైనా కలిసి మాట్లాడుకుంటేనే, కలిసి ఫోటో దిగితేనో చూడాలని చాలామంది ఆశపడుతుంటారు. అయితే ఇప్పుడు అలాంటి వాళ్ళ కొరిక తీరబోతుంది. ఈముగ్గురు నేతలు ఇప్పుడు ఒకే వేదికపై కలవబోతున్నారు. రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ రాజ్ భవన్ లో అట్ హోం ఏర్పాటు చేసారు. అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానించారు. హైకోర్టు న్యాయమూర్తులతో పాటుగా ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు రాజ్ భవన్ లో జరిగే తేనేటి విందుకు హాజరు కానున్నారు. రాజ్ భవన్ కు సీఎం జగన్ – భారతి దంపతులు హాజరు కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. చంద్రబాబు గత ఏడాది అట్ హోం కు హాజరయ్యారు.

పవన్-బాబు వస్తారా!!
గత ఏడాది కూడా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇద్దరికి కూడా ఆహ్వానాలు అందాయి కానీ చంద్రబాబు నాయుడు మాత్రమే వెళ్లారు. పవన్ కళ్యాణ్ అప్పుడు హాజరు కాలేదు. అయితే ఈసారి మాత్రం పవన్ కళ్యాణ్ కూడా వెళ్లే అవకాశం ఉందని జనసేన నాయకులు చెప్తున్నారు. అయితే ఒకే ఫంక్షన్ కు వెళ్లినా కూడా ఒక్కరికీ ఒకరు ఎదురుపడుతారా, ఎదురుపడినా మాట్లాడుతారా అన్నది ప్రశ్న. ఒకవేళ ముగ్గురు ఉన్న ఫోటో బయటికి వస్తే మాత్రం సోషల్ మీడియాలో వైరల్ కావడం ఖాయం. అయితే అసలు వీళ్ళలో ఎంతమంది ఈ ఈవెంట్ కు వెళ్తారో తెలియడం లేదు. పవన్ కళ్యాణ్ విజయవాడలో ఉన్నారు. చంద్రబాబు నాయుడు కుప్పంలో నారా లోకేష్ పాదయాత్ర పనుల్లో బిజీగా ఉన్నారు. ఇవ్వన్నీ వదిలేసి, రాజ్ భవన్ కు వెళ్తారో లేదో చూడాలి .
జగన్ వస్తారా!!
నిన్ననే ఒక ఫంక్షన్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… “తనను ఒక ఆఫీసర్ వాళ్ళింట్లో జరుగుతున్న ఫంక్షన్ కు పిలిచారు, అదే ఫంక్షన్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి కూడా వస్తున్నారు. అయితే తానూ బయలుదేరుతున్న సమయంలో ఆ ఆఫీసర్ కాల్ చేసి, తననురావొద్దని చెప్పారు. ఎందుకని అడిగితే మీరు వస్తే, సీఎం రానని అంటున్నాడని” చెప్పారు. కాబట్టి ఇప్పుడు ఈ ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు అంతా వస్తున్నారు కాబట్టి జగన్ రాకపోవచ్చని వార్త కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎన్నికలకు ముందు ఈ ముగ్గురు ఇలా ఒకే చోట కలవడం ఇప్పుడు రాజకీయాల్లో చర్చగా మారింది.