Jagan: ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ ను రాజధానిగా చేసుకుంటూ, చాల అభివృద్ధి చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికీ రాజధాని లేదు. రెండు రాష్ట్రాలు విడిపోయి, 10 సంవత్సరాలు అవుతున్నా కూడా, ఇంకా రాజధాని లేదు. గతంలో చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు అమరావతిని రాజధానిగా, ప్రకటించి, దాన్ని అభివృద్ధి చెయ్యడానికి చాలా ప్రయత్నాలు చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావడంతోనే ఇప్పుడు మూడు రాజధానులు అంటూ ప్రకటించింది. విశాఖపట్నంను పరిపాలనా రాజధానిగా చేస్తూ ప్రకటన విడుదల చేశారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ, కొంతమంది రాష్ట్రంలో ధర్నాలు చేస్తున్నారు. అయితే ఇవన్నీ పట్టించుకోకుండా విశాఖను ఇంటర్నేషనల్ లెవెల్ లో అభివృద్ధి చెయ్యడానికి చాల ప్రణాళికలు రచించారు. వాటిని అమలు చెయ్యడానికి వైఎస్ జగన్ సిద్ధమయ్యారు. అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రపంచ స్థాయి పెట్టుబడిదారుల సదస్సు 2023ని వైఎస్ జగన్ దీనికి వేదికగా మలచుకున్నారు.
సదస్సుకు వస్తున్న వారెవరు?
మార్చి నెలలో ఈసదస్సును నిర్వహించడంలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ భాగస్వామిగా వ్యవహరించనుంది. అయితే ఈసదస్సుకు ప్రపంచ స్థాయిలో ఉన్న పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించనున్నారు. ఈసదస్సుకు యాపిల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ కు ఆహ్వానపత్రాన్ని పంపించనుంది. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా, టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్, అపర కుబేరుడు అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ ను ఆహ్వనించనుంది జగన్ ప్రభుత్వం. అలాగే మోడీకి కూడా ఆహ్వానం పంపనున్నారు. టాప్ సెర్చింజిన్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, మైక్రోసాఫ్ట్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, చీఫ్ సత్య నాదెళ్ల పేర్లను కూడా జగన్ ప్రభుత్వం ఆహ్వానితుల జాబితాలో చేర్చింది. దక్షిణ కొరియాకు చెందిన సామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ అధినేత, సీఈఓ ఓహ్-హ్యున్ క్వాన్ ఈ జాబితాలో ఉన్నారు. అలాగే దేశంలో ఉన్న అంబానీ లాంటి వాళ్ళు కూడా ఈసదస్సుకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.
క్రెడిట్ మొత్తం జగన్ కే!!
ఒకవేళ జగన్ అనుకున్నట్టు విశాఖ డెవలప్ అయితే, ఇప్పుడు ఆ క్రెడిట్ మొత్తం జగన్ కే వెళ్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు విశాఖకు కనీసం ఒక్క పెట్టుబడి కూడా తీసుకోని రాలేదు. ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ప్రపంచంలో ఉన్న ప్రముఖ సంస్థలను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నారు. సదస్సుకు వచ్చే సంస్థలు ఒకవేళ పెట్టుబడులు పెడితే విశాఖ రూపురేఖలు మారిపోయేలా ఉన్నాయ్. అలా జరిగితే వచ్చే రోజుల్లో జగన్ కూడా బాబులా తానే విశాఖను డెవలప్ చేశానని వెళ్లిన ప్రతిచోటా చెప్పుకుంటాడు. జగన్ క్రెడిట్ కొట్టేస్తే, బాబు ఇక రానున్న రోజుల్లో జగన్ ను చూసి, ఏడవటం తప్పా ఏమి చెయ్యలేదు. ఇప్పటికే అధికారం కోసం చంద్రబాబు నానాగడ్డి కారుస్తున్నారు, ఇంకా రాజధాని క్రెడిట్ కూడా జగన్ కు పోతే బాబు లైఫ్ లాంగ్ ఏడుస్తూనే ఉంటారు.