KA Paul: మనకు సినిమాల్లో కమెడియన్స్ ఉంటారని ఉంటారని తెలుసు, కానీ పాలిటిక్స్ లో కూడా కమెడియన్స్ ఉంటారని కేఏ పాల్ నిరూపించారు. ఈయన వల్ల తెలంగాణ, ఏపీ రాజకీయాల్లో నాయకులకు, ప్రజలకు మాంచి ఎంటర్టైన్ మెంట్ ఇస్తున్నారు. అయితే కేఏ పాల్ ఇప్పుడు ఒక మంచి ఉద్దేశంతో మళ్ళీ ఏపీ రాజకీయాల్లోకి వచ్చారు. మొన్నటి వరకు తెలంగాణ రాజకీయాల్లో బిజీగా ఉన్న కేఏ ఇప్పుడు చంద్రబాబు నాయుడుపై పోలీసులకు కంప్లైంట్ చెయ్యడానికి కందుకూరు వచ్చారు. నిన్న కందుకూరులో చంద్రబాబు నాయుడు చేపట్టిన రోడ్ షో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికే ఎనిమిది మంది చనిపోయారు. ఈ ఘటనకు చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలని, ఈ మరణాలకు ఆయనను భాధ్యుడిది చేస్తూ అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు.
బాబుకు బుద్దుందా!!
2019 వచ్చిన ఓటమిని చంద్రబాబు నాయుడు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. ఆ ఓటమి ఇచ్చినా అభద్రతా భావం వల్ల నిత్యం ప్రజల్లో తనకు ఇంకా ఆదరణ తగ్గలేదని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అందుకే ఇప్పుడు కందుకూరులో కేవలం 1000 మంది మాత్రమే నడవగలిగే చిన్న రోడ్ లో దాదాపు 50వేల మందితో రోడ్ షో ను ఏర్పాటు చేశాడు. తనకు సభకు ఇసుకు వేస్తె రాలన్నంత జనం వచ్చారని చెప్పుకోవడానికి చేసిన పని ఇప్పుడు 8మంది మరణించారు. ఈ చావులకు బాబు ఖచ్చితంగా బాధ్యత వహించాలి. అయితే ఈ రాజకీయ నాయకులు చేసే ఈ సభలకు, రోడ్ షోలకు ఈ జనం ఎందుకు వెళ్తారో అర్థం కాదు. ఇంట్లో ఉండి, టీవీలో చూసినా కూడా అదే కనిపిస్తుంది,కానీ పనీ, పాటలేని వాళ్ళలా సభలకు వెళ్లి ప్రాణాలమీదకు తెచ్చుకుంటారు. ఈ సంఘటనను చూసైనా జనాలకు ఈ రాజకీయ నాయకులు చేపట్టే సభలకు వెళ్లకుండా ఉండాలి.
కేఏ పాల్ చెప్పింది నిజమేగా!!
కందుకూరు విషయంలో కేఏ పాల్ ఇచ్చిన కంప్లైంట్ లో చాలా న్యాయం ఉంది. ఇక్కడ జరిగిన ఘటనకు కారకుడైన బాబును అరెస్ట్ చెయ్యాలని కంప్లైంట్ లో పేర్కొన్నారు. ఇందులో ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం ఉందని, దీనిపై పోలీసులు దర్యాప్తు నిర్వహించి నిజానిజాలు వెలికి తీయాలని కేఏ పాల్ కోరారు. జనాలు రాకపోతే బిర్యానీలు ఇచ్చి మరీ ఇక్కడికి జనాలను ఎందుకు తీసుకు వచ్చారని పాల్ బాబుకు ప్రశ్నలు సంధించారు. అలాగే ఇంత చిన్న రోడ్ లో రోడ్ షో కు పోలీసులు ఎందుకు పర్మిషన్ ఇచ్చారని, ఇందులో వాళ్ళ నిర్లక్ష్యం కూడా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇంకా పోలీసులు ఎవ్వరిని అరెస్ట్ చెయ్యకపోవడంపై రాష్ట్రంలోని ప్రజల నుండి చాల విమర్శలు వస్తున్నాయి.