Kalvakuntla Kavitha:కవితకు ఇప్పుడు పసుపు బోర్డు ఎందుకు గుర్తు వచ్చింది ??

Arjun

Kalvakuntla Kavitha:తెలంగాణ రాష్ట్రంలో నాయకులకు ప్రజల బాగోగులు కేవలం ఎన్నికలకు ముందు మాత్రమే గుర్తుకు వస్తాయి. తెరాసా నాయకులు ఈ ఆచారాన్ని మరింత పకడ్భందిగా పాటిస్తున్నారు. అందుకే రాష్ట్రంలో ఉద్యోగాలు ఎన్నో సంవత్సరాలుగా ఖాళీగా ఉన్నప్పటికీ

kalvakuntla kavitha started her politics in nizamabad

ఇప్పుడు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారు. అలాగే ఇప్పుడు కల్వకుంట్ల కవిత ఇప్పుడు మళ్ళీ నిజామాబాద్ ఎంపీ సీట్ పై ఇప్పటి నుండే కసరత్తు ప్రారంభించారు.

అరవింద్ పై విరుచుకుపడ్డ కవిత

రాష్ట్రంలో ఎన్నికలు దగ్గరకు వస్తున్న నేపథ్యంలో కల్వకుంట్ల కవిత ఎంపీ అరవింద్ పై పసుపు బోర్డు పై ప్రశ్నలు కురిపిస్తున్నారు. పసుపు బోర్డు తెస్తానని బాండ్ రాసిచ్చిన అరవింద్ ఇప్పటికీ తీసుకురాకుండా ఏమి చేస్తున్నారని, ఇచ్చిన మాట తప్పిన అరవింద్ ను తాము ఎక్కడికి అక్కడ అడ్డుకుంటామని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీగా ఉన్నప్పుడు పార్లమెంట్ లో తెరాసా ప్రతినిధులమంతా కలిసి ప్రైవేట్ బిల్ ప్రవేశపెట్టామని, అలాగే ప్రధానిని కూడా కలిసి బోర్డు విషయమై చర్చించానని వెల్లడించారు.

అరవింద్ ఏమి చేశాడు!!

అరవింద్ ఎంపీగా గెలిచి మూడు సంవత్సరాలు ఐతున్నప్పటికీ ఇంకా బోర్డు విషయమై ఒక స్పష్టత రాలేదు. కనీసం ప్రధానితో కూడా ఈ విషయమై అరవింద్ డిస్కస్ చెయ్యలేదని కవిత ఆరోపించారు. మూడేళ్ళలో అరవింద్ కేవలం రైతులకు 300 రూపాయలు ఇప్పించారని, ఈ విషయాన్నీ తానూ ఆర్టీఏ తెలుసుకున్నానని కవిత తెలిపారు. అయితే కేవలం ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కవిత ఇంత హంగామా చేస్తుందని బీజేపీ నాయకులూ ఆరోపిస్తున్నారు.

 

- Advertisement -