KCR: రాష్ట్రంలో బీజేపీ-టిఆర్ఎస్ మధ్యన వార్ ఒకరు రేంజ్ లో జరుగుతుంది. బీజేపీ తెలంగాణాలో పాక వెయ్యడానికి సిద్ధమైతుంటే, బీజేపీని కేంద్రం నుండి దించెయ్యడానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇలా రెండు పార్టీల మధ్య వార్ జరుగుతుంది. మొన్నటి వరకు ఢిల్లీలో ఉంది బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న నాయకులను కలిసిన కేసీఆర్, సడన్ గా రాష్ట్రానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు రాష్ట్రంలో కేటీఆర్ కూడా లేడు , తానూ కూడా లేకపోతే ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇచ్చిన వాళ్ళం ఐతామని భావించే కేసీఆర్ రాష్ట్రానికి వెంటనే తిరిగి వచ్చారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఇప్పుడు మరోసారి కేసీఆర్ మోడీ మధ్య వార్ జరిగేలా ఉంది. గతంలోలా కేసీఆర్ తప్పించుకుంటారో లేదా ధైర్యంగా మోదిని ఎదుర్కుంటారో చూడాలి.
రాష్ట్రానికి మోడీ
ఈనెల 26న హైదరాబాద్ లోని ఇండియాన్ స్కూల్ అఫ్ బిజినెస్ జరిగే కార్యక్రమానికి మోడీ హాజరు అవుతున్నారు. ఆఫీసియల్ ఈవెంట్ కాబట్టి ప్రోటోకాల్ ప్రకారం, సీఎం కేసీఆర్ మోదీకి స్వాగతం చెప్పి, కార్యక్రమాల్లో పాల్గొనాల్సి ఉంది. కానీ కేసీఆర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమానికి హాజరు కారని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. మోడీకి మొహం చూపించకూడదనే ఉద్దేశంతోనే మోదీ వచ్చిన ప్రతిసారి కేసీఆర్ రాష్ట్రంలో ఉండేవారు కాదు. కానీ ఈసారి రాష్ట్రంలోనే ఉన్నారు మరి మోదీకి ఆహ్వానం పలుకుతారో లేదో చూడాలి.
మళ్ళీ అవమానిస్తారా!!
గతంలో మోదీ రాష్ట్రానికీ సమతామూర్తి విగ్రహావిష్కకరణకు వచ్చారు. ఈ కార్యక్రమానికి కేసీఆర్ వెళ్తారని అందరు అనుకున్నారు కానీ కేసీఆర్ వెళ్ళలేదు. చివరి క్షణం వరకూ హాజరవుతారనుకున్నారు. కానీ శిలాఫలకంపై పేరు లేకపోవడంతో వెళ్ళలేదు. ఇలా రాష్ట్రాల్లోనే కేసీఆర్ ను అవమానించిన మోదీ, ఈసారి కూడా కేసీఆర్ ను అవమానించే విధంగా ఏదైనా వ్యూహం వేసే ఉంటారని టిఆర్ఎస్ నాయకులుచెప్తున్నారు. ఈసారి మోదీ-కేసీఆర్ మధ్య ఏం జరుగుతుందో వేచి చూడాలి.