KCR:బీజేపీ లాంటి రాజకీయాలనే తెరాస కూడా చేస్తుందా!!

Arjun

KCR:కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టమొచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగపరుస్తూ, ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా వాడుకుంటూ నాశనం చేస్తున్నారు. అయితే బీజేపీ చేస్తున్న రాజకీయాలను ఎప్పుడూ తప్పు పడుతూ, ప్రధాని మోడీని తిడుతూ ఉండే తెరాస కూడా ఇప్పుడు బీజేపీ చేస్తున్న రాజకీయాలనే చేస్తుంది. అధికారం చేతిలో ఉందని ఇష్టమొచ్చినట్టు తెరాస నాయకులు ప్రవర్తిస్తున్నారు.

Kcr also doing same politics which bjp has been doing in india

తమ పార్టీకి తమ ప్రభుత్వం నుండి కోట్లు విలువ చేసే ఆస్తులను బదిలీ చేస్తూ, ప్రజలను మోసం చేస్తున్నారు. ఒకవేళ ఇదే పని బీజేపీ చేసి ఉంటే ఇప్పటికే కేసీఆర్ ప్రెస్ మీట్ పెట్టి మరీ బీజేపీని తిట్టేవాడు. మాటల్లో మాత్రం తెలంగాణ అభివృద్దే తమ లక్ష్యమని చెప్పే కేసీఆర్ ఇలాంటి చిల్లర పనులు కూడా చేస్తున్నారు.

వంద కోట్ల ల్యాండ్

తెరాసకు ఇప్పటికే హైదరాబాద్ లో కేంద్ర పార్టీ ఆఫీస్ ఉంది. అయితే ఇప్పుడు తెరాసాకు హైదరాబాద్ జిల్లా శాఖకు కార్యాలయం అవసరం వచ్చింది. దీనికోసం హైదరాబాద్ కలెక్టర్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తు యొక్క ఆవశ్యకత గుర్తించిన కలెక్టర్ వెంటనే అనుమతులు మంజూరు చేస్తూ, షేక్ పేట మండలంలో 935 చ.గ.ల స్థలాన్ని ఇచ్చారు. దీని విలువ దాదాపుగా వంద కోట్లు ఉంటుంది. ఇలా తమకున్న అధికారాన్ని వాడుకుంటూ వంద కోట్లు విలువ చేసే ప్రజల ఆస్తిని సొంతానికి వాడుకుంటున్నారు. అయన ఒక రాజకీయ పార్టీకి ప్రజల ఆస్తిని అధికారులు ఎలా మంజూరు చేశారో అర్ధం కావడం లేదు. తెలంగాణ అభివృద్ధి పక్కన పెడితే తెలంగాణ పేరుతో కేసీఆర్ ఫ్యామిలి, తెరాస పార్టీ బాగా ఆస్తులను వెనక వేసుకుంటున్నారు.

అధికారులకు బుద్దుందా!!

తెరాస పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఎలాంటి చిల్లర పనులైనా చెయ్యొచ్చు కానీ ఆ పనికి అధికారులు ఎలా మద్దతు తెలిపారో అర్ధం కావడం లేదు. అది ప్రజల ఆస్తి, దాన్ని ఒక రాజకీయ పార్టీకి రాసి ఇవ్వడానికి అధికారులకు బుద్దుందా అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో ప్రతిపక్షాల నాయకులు కూడా తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. తెరాస లాంటి రాజకీయ పార్టీకి స్థలం ఇచ్చారు కాబట్టి తమకు కూడా ఇవ్వాలని, లేదా ఆ భూమిని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -