KCR: కేసీఆర్ కు ఉన్నంత ఓవర్ కాంఫిడెన్స్ రాజకీయాల్లో ఏ నాయకుడికి ఉండదు కావొచ్చు. ఆ ఓవర్ కాంఫిడెన్స్ పనికి రాడానికి ఇప్పటికే జరిగిన బై ఎలక్షన్స్ లో ప్రజలు తేల్చారు. అయినా కూడా కేసీఆర్ అర్థం చేసుకోవడం లేదు. ఆ ఓవర్ కాంఫిడెన్స్ తోనే మొన్నటి వరకు జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నించారు. అయితే ఇప్పుడు రాష్ట్రంలో ప్రతిపక్షాల బలం మెల్లగా పెరగడంతో కేసీఆర్ కు భయం పట్టుకుంది. అలాగే తన రాజకీయ వ్యూహకర్త కూడా అదే విషయం చెప్పడంతో ఇప్పుడు మళ్ళీ రాష్ట్ర రాజకీయాలపై దృష్టి పెట్టారు. అందుకే ఇప్పుడు రాష్ట్రంలో ప్రజాలు తనం పాలన పట్ల ఎలా ఆలోచిస్తున్నారు అన్న విషయంపై ఆరాలు తీస్తున్నారు. ఇలా చేయడం వాళ్ళ తన పార్టీ పై ప్రజల్లో ఉన్న అభిప్రాయాన్ని చూసి కేసీఆర్ కూడా షాక్ అవుతున్నట్టు రాజకియ వర్గాలు చెప్తున్నారు. అయితే ఇంకా ఎలక్షన్స్ కి టైం ఉండటంతో వాటిని మార్చడానికి వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇప్పటికే చాలామంది నాయకుల పట్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారన్న విషయం పీకే కూడా చెప్పారని సమాచారం.
ధరణిపై కేసీఆర్
పీకే ఇచ్చిన సమాచారం ప్రకారం మొదట ధరణి సమస్యలపై దృష్టి పెట్టారు. ధరణిపై తొలి సారి దృష్టి సారించారు. తెలంగాణ సర్కార్ భూ సమస్యల పరిష్కారం కోసం అంటూ ధరణిని తీసుకు వచ్చింది. కానీ ఇది భూ సమస్యలను రెండింతలు చేసింది. దీంతో ప్రతీ గ్రామంలోనూ ఏదో ఓ సమస్య ఏర్పడింది. దీని వల్ల లక్షల మంది ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్య గురించి రాజకీయ పార్టీలు కూడా చాలా కాలంగా ఆందోళనలు నిర్వహిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన డిక్లరేషన్‌లో ధరణి రద్దు అనేది కూడా ఒకటి. ఈ హామీ చాలా మందిని విశేషంగా ఆకర్షిస్తోందని టీఆర్ఎస్‌కు ఫీడ్ బ్యాక్ అందుతోంది. దింతో ధరణిపై ఉన్న సమస్యలను పూర్తిగా దూరం చేసి మళ్ళీ ప్రజల మద్దతు పొందటానికి కేసీఆర్ వ్యూహం రచించారు.
నాయకులపై దృష్టి
ఇప్పటికే ఎన్నికలకు సంబంధించిన పూర్తి సర్వేను ప్రశాంత్ కిషోర్ పూర్తి చేశారు. ఆ సర్వే ప్రకారం వచ్చే ఎన్నికల్లో చాలామంది నాయకులు ఓడిపోవడం ఖాయమని తేలింది. అయితే వారికి మళ్ళీ అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదని కేసీఆర్ చెప్పారని సమాచారం. అయితే వారి స్థానంలో ఎవరిని నిలబెట్టాలని కేసీఆర్ ఇప్పటి నుండే సెర్చింగ్ మొదలు పెట్టారు. ప్రజలకు దగ్గరగా ఉన్న వారికే అవకాశం ఇస్తారు. బీజేపీ ఇస్తున్న షాక్ లకు కేసీఆర్ పూర్తిగా జాతీయ రాజకీయాలను పక్కన పెట్టి కేవలం రాష్ట్రంపైనే దృష్టి పెట్టారు. కేసీఆర్ రంగంలోకి దిగితే బీజేపీ, కాంగ్రెస్ కు ఓటమి ఇంకా చేరువ అవుతుంది. కేసీఆర్ వ్యూహాలను ప్రతిపక్షాల నాయకులు ఇలా అడ్డుకుంటారో వేచి చూడాలి.