తెలంగాణలో ఇటు ఆంధ్రా, తెలంగాణ మధ్య జల పంపకాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం చెలరేగుతున్న విషయం తెలిసిందే. నిరంతరాయంగా విద్యుత్ వాడకం చేపడుతున్న కారణం ఒకటైతే, కృష్ణా నదిపై అక్రమ ప్రాజెక్టులు దీనిని తక్షణమే అడ్డుకోవాలని గ్రీన్ ట్రిబ్యునల్ దగ్గర ఫిర్యాదు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ సైతం ఇరు రాష్ట్రాల సీఎంలు సైతం కూర్చొని చర్చించుకోవాలని తెలిపిన విషయం తెలిసిందే. ఇక అప్పటి నుండి జల జగడాలపై ఇటు మంత్రుల వ్యాఖ్యలు, స్వయంగా జగన్ కూడా పక్క రాష్ట్రాలతో మాకు గొడవలు పెట్టుకోవడం ఇష్టం లేదని, ఆంధ్ర ప్రదేశ్ కు నష్టం జరిగే కార్యక్రమాలు ఎవరు చేపట్టినా ఒప్పుకునేది లేదని జగన్ కూడా తెలిపిన పరిస్థితి ఉంది. అయితే జగన్, కెసీఆర్ ఎందుకు ఈ విషయంలో వెనక్కి తగ్గడం లేదనే విషయాన్ని పరిశీలిస్తే వైఎస్ షర్మిల తెలంగాణలో పార్టీని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు షర్మిల వ్యవహారాన్ని లైట్ తీసుకున్న కెసీఆర్ ఇక సీరియస్ గా ఉన్నట్టు తెలుస్తోంది.
జల జగడాల పరిష్కారం దిశగా కొరవడిన చొరవ
జగన్ జైలులో ఉన్నప్పుడు పార్టీని ప్రజల్లో నిలిపి ఉంచేలా కృషి చేసిన షర్మిలకు జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత తగినంత ప్రాధాన్యత కల్పించకపోవడం పట్ల షర్మిల జగన్ పై అగ్రహంగా ఉన్న విషయం తెలిసిందే. అయితే జగన్ మీద కోపంతో తెలంగాణ రాజకీయాలలోకి ఎంట్రీ ఇచ్చిన షర్మిలను కట్టడి చేయాలని జగన్ కు కెసీఆర సూచించడం జరిగింది. కాని షర్మిలను అడ్డుకోవడంలో జగన్ విఫలమవడంతో కెసీఆర్ జగన్ మీద స్నేహ పూర్వక వైఖరి కలిగి ఉన్న కెసీఆర్ ఇప్పుడు తెలంగాణకు దక్కాల్సిన వాతాలో ఏ మాత్రం తగ్గేది లేదన్న చందంగా వ్యవహరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఈ చిక్కుముడి అన్నది ప్రజల్లోకి బయటకు రాకున్నా షర్మిల వ్యవహారంతో జగన్ కు కొంత ఒత్తిడి తప్పేలా లేనట్లు తెలుస్తోంది. మరి ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సి ఉంది.