KCR: రాజకీయ వ్యూహాలు రచించడంలో కేసీఆర్ ను మించిన నాయకులు తెలంగాణాలో ఎవ్వరూ లేరు. కేసీఆర్ ఎలా అడ్డుకోవాలని తెలంగాణాలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ నాయకులు తీవ్ర ఇబ్బందులు పదుతున్నారు. కేసీఆర్ కు ఎవర్ని ఇప్పుడు ఎలా వాడుకోవాలని బాగా తెలుసు. గత ఎన్నికల్లో టీడీపీని అడ్డుపెట్టుకొని, తెలంగాణ సెంటిమెంట్ తో అధికారంలోకి వచ్చారు. అయితే ఇప్పుడు బీజేపీని అడ్డుపెట్టుకొని మరోసారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఇదే క్రమంలో కాంగ్రెస్ ను కూడా ఎలా దెబ్బకొట్టాలో కూడా వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ కంటే కూడా కాంగ్రెస్ కు ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. పైగా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పై ప్రజాల్లో ఎంతో కొంత మంచి అభిప్రాయం ఉంది. దాన్ని కూడా పోగొట్టడానికి కేసీఆర్ వ్యూహం రచిస్తున్నారు. ఎందుకంటే అసలుకాంగ్రెస్ పోటీలోనే లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించడానికి కేసీఆర్ ట్రై చేస్తున్నారు.
ముందస్తు నాటకాలు
రాష్ట్రంలో ఇప్పుడు బీజేపీ, తెరాసా నాయకులూ ముందస్తు నాటకాలు ఆడుతున్నారు. ఇప్పటికే రెండు పార్టీలు ముందస్తుకుసిద్ధమని ప్రకటించాయి. అయితే ముందస్తు విషయంలో కేసీఆర్ ను బీజేపీ నాయకులు భయపెడుతున్నారు. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ ముందస్తును ప్రకటిస్తే రాష్ట్రపతి పాలనను విధించి, మొదటికే మోసాన్ని తెస్తారని కేసీఆర్ భయపడుతున్నారు. బీజేపీ కూడా ముందస్తు వస్తే అదే పని చెయ్యాలని ప్లాన్ చేస్తుంది. ఈ విషయాన్నీ పసిగట్టిన కేసీఆర్ ముందస్తుకు వెళ్ళడానికి భయపడుతున్నారు. అయితే రెండు పార్టీలు మాత్రం ముందస్తు గురించి బలంగా మాట్లాడుతున్నారు. ఐన ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా మళ్ళీ గెలిచేది కేసీఆర్ మాత్రమే . కేసీఆర్ గెలుపుకు ఆయన చేసిన అభివృద్ధి కాదు, ప్రతిపక్షాల అసమర్థతే కారణం.బీజేపీ మతాన్ని పట్టుకొని వేలాడుతుంటే, కాంగ్రెస్ కు అసలు ఎలా ప్రజల దగ్గరకు వెళ్ళాలో అర్థంకావడం లేదు. ఈ రెండు పనికిమాలిన పార్టీల మధ్య మరో పనికిమాలిన పార్టీ లాభపడుతుంది.
కాంగ్రెస్ ను పక్కన పెట్టగలరా !!
బీజేపీని అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ సైడ్ చెయ్యాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలను కాంగ్రెస్ నాయకులు ఎలా అడ్డుకుంటారో వేచి చూడాలి. ఎందుకంటే కాంగ్రెస్ కు ప్రజల్లో ఉన్న ఆదరణ ఇప్పటిది కాదు. ఎప్పటినుండో ఉన్న పార్టీని తీసెయ్యడం అంత సులువు కాదు. పైగా తెరాసా ఎంతకాదనుకున్నాకూడా వచ్చే ఎన్నికల్లో పోటీ మాత్రం కేసీఆర్, కాంగ్రెస్ మధ్య మాత్రమే. ఈ పోటీని ఎవ్వరూ ఆపలేరు. బీజేపీ కేవలం కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితం. అయినా మత రాజకీయాలు చేస్తున్న బీజేపీని ప్రజలు తొందర్లోనబుద్ది చెప్తారు. కాంగ్రెస్ కు ఉన్న క్యాడర్ కు బీజేపీ కి ఉన్న క్యాడర్ అసలు సంబంధమే లేదు. ఏ విధంగా చూసుకున్న ప్రజల్లో బీజేపీ కంటే కాంగ్రెస్ కే ఎక్కువ ఆదరణ ఉంది.