KCR
KCR

KCR: ఎన్నికలు దగ్గరకు వస్తున్న సమయంలో కేసీఆర్ ప్రచారం కూడా ఊపందుకుంది. ఇవ్వాళా కోదాడలో జరిగిన ప్రజా ఆశీర్వాదం సభలో కేసీఆర్ మాట్లాడుతూ… కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, అక్కడి రైతులకు కేవలం 5 గంటలు మాత్రమే కరెంటు ఇస్తుందని, ఇప్పుడు ఆ పార్టీకి ఓటు వేస్తే, తెలంగాణాలో కూడా అదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. అలాగే రాష్ట్రానికి ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీనే శ్రీరామ రక్షా అని తెలిపారు. అలాగే తాము అధికారంలో వస్తే, రైతు బందును 16వేల దాక పెంచుతామని హామీ ఇచ్చారు. అయితే ఈ హామీపై ఇప్పుడు రాజకీయంగా పెద్ద చర్చ జరుగుతుంది.

16వేలు ఇవ్వడం సాధ్యమేనా!!

రైతు బంధు ఇప్పుడు 10వేలు ఇస్తున్నారు. అయితే తాము మళ్ళీ అధికారంలోకి వస్తే, ఈ 10వేలను 16వేలకు పెంచుతామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. అయితే ఇప్పుడు రైతులకు 10వేలు ఇవ్వడంతోనే ప్రభుత్వం జాప్యం చేస్తున్న చేస్తుందని, దానిని భరించే శక్తే ప్రభుత్వం దగ్గర లేదని, అలాంటి సమయంలో 16వేలు ఎలా ఇస్తారని ప్రతిపక్షాల నేతలు ప్రశ్నలు సంధిస్తున్నారు. అయితే దీనికి బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ… ఈ రైతు బంధుని అంచలంచెలుగా 16 వేల వరకు పెంచుతామని, ఇలా చెయ్యడానికి తమ దగ్గర వ్యూహముందని చెప్తున్నారు.

ప్రజలను మోసం చెయ్యడానికేనా!!

వృద్ధుల పింఛన్ ను కూడా 5000 వరకు పెంచుతామని బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. దాన్ని కూడా ఒకేసారి కాకుండా కొద్దీ కొద్దిగా పెంచుకుంటూ 5000 వరకు పెంచుతామని మంత్రి హరీష్ రావు చెప్తున్నారు. అయితే మేనిఫెస్టోలో మాత్రం బీఆర్ఎస్ ఇంత క్లియర్ గా ఈ స్కీం గురించి మెన్షన్ చెయ్యలేదు. కేవలం 5000 ఇస్తామని మాత్రమే ముద్రించారు. పైగా ఆ పార్టీ నాయకులు మాట్లాడుతూ కూడా ఇదే విషయాన్ని చెప్తున్నారు . ఇలా క్లియర్ గా చెప్పకుండా ప్రజలను మోసం చెయ్యడం ఎందుకని రాజకీయ విశ్లేషకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on అక్టోబర్ 29, 2023 at 7:38 సా.