Vijayan: మత రాజకీయాలను చేస్తూ, ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొడుతున్న బీజేపీకి వ్యతిరేకంగా తానూ పోరాడుతున్నానని తెలంగాణ సీఎం కేసీఆర్ ఎప్పటి నుండో చెప్తున్నారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని కేంద్రంలో అధికారం నుండి కిందికి దింపడానికి తానూ ప్రయత్నం చేస్తానని చెప్పారు. దానిలో భాగంగానే టీఆర్ఎస్ పార్టీని ఇప్పుడు బీఆర్ఎస్ గా మార్చారు. జాతీయ పార్టీగా మారిన తరువాత కేసీఆర్ నిర్వహిస్తున్న అతిపెద్ద సభ ఖమ్మంలో జరుగుతుంది. ఇందులో పాల్గొనటానికి జాతీయ నాయకులను అహ్వాహించారు. ఈసభకు వచ్చిన నాయకులు కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని గద్దెదించడానికే చూస్తున్నారు. ఇక్కడికి వచ్చిన వారిలో కేరళ సీఎం పినరయ్ విజయన్ కూడా ఉన్నారు. బీజేపీపై కేసీఆర్ చేస్తున్న పోరాటానికి తాను కూడా మద్దతు ఇస్తున్నానని, బీజేపీ కేరళలో తాము తరిమికొట్టినట్టు ఇక్కడ కూడా తరిమి కొట్టాలని విజయన్ కోరారు.
దేశానికి దిక్సూచీ
ఈరోజు ఇక్కడ జరుగుతున్నా సభ దేశానికి దిక్సూచీ లాంటిదని విజయన్ అభిప్రాయం వ్యక్తం చేశారు. మత రాజకీయాలు, కుల రాజకీయాలు, ప్రాంతీయ భావాలతో బీజేపీ రాజకీయం చెయ్యడానికి చూస్తుందని, అలాంటి ఎదుర్కొవాలనుకున్న వాళ్లందరికీ ఈ సభ ఒక దిక్సూచీలాంటిదని తెలిపారు. దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న శక్తులన్నింటినీ ఏకం చెయ్యడానికి కేసీఆర్ పోరాటం చేస్తున్నారని, దానికి తమ ఎప్పుడూ ఉంటుందని, కేసీఆర్ తో కలిసి పోరాడుతానని తెలిపారు. గతంలో తెలంగాణను తీసుకోని రావడానికి కేసీఆర్ ఎంత కష్టపడ్డాడో ఇప్పుడు బీజేపీ చేతుల్లో నుండి దేశాన్ని కాపాడటానికి కూడా అంతే కష్టపడుతున్నారని తెలిపారు. రాష్ట్రాలపై కూడా పెత్తనం చెలాయించడానికి ప్రయత్నాలు చేస్తున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని ప్రజలకు తెలిపారు.
ప్రాంతీయ బాషాలను కాపాడాలి
ఒకే దేశం-ఒకే భాష, ఒకే దేశం -ఒకే ట్యాక్స్ అంటూ బీజేపీ రాష్ట్రాల అస్థిత్వాన్ని తొక్కేయడానికి బీజేపీ ప్రయత్నాలు చేస్తుందని, అలాంటి వాళ్ళను దగ్గరికి రానివ్వకూడదని విజయన్ తెలిపారు. ప్రాంతీయ భాషల ప్రాముఖ్యతను తగ్గించడానికి బీజేపీ ప్రయత్నిస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందీ భాషను బలవంతంగా రుద్దటానికి బీజేపీ ప్రయత్నిస్తుందని, చివరికి సుప్రీం కోర్ట్ ను కూడా బీజేపీ నాయకులు బెదిరిస్తున్నారని, అలాంటి వాళ్ళ నుండి రాజ్యాంగాన్ని కోర్టులు మాత్రమే కాపాడగలవని తెలిపారు. రాజ్యాంగాన్ని కూడా లెక్కచెయ్యని బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే కేసీఆర్ ప్రభుత్వం తెచ్చిన కంటి వెలుగు కార్యక్రమం బాగుందని, దాన్ని కేరళలో కూడా అమలు చేస్తామని వెల్లడించారు.