Vangaveeri Ranga: ఎన్నికలకు ఇంకా చాల టైం ఉంది కానీ ఇప్పటి నుండి మత రాజకీయాలు, కుల రాజకీయాలు చెయ్యడానికి నాయకులు సిద్ధమయ్యారు. వంగవీటి రంగా ఆధారంగా ఏపీలో ఇప్పుడు అన్నీ పార్టీల నాయకులు కుల రాజకీయాలు చేస్తూ, కాపు కుల ఓట్ల కోసం కుక్కలా కొట్టుకుంటున్నారు. కుక్కల కన్నాహీనంగా ఎక్కువగా రంగాను బేస్ చేసుకొని రాజకీయ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. ఇవన్నీ ప్రజలు చూస్తున్నారు. మొన్నటి వరకు రంగా మీద లేని ప్రేమ ఇప్పుడు సడన్ గా ఎందుకు చుపిస్తున్నారో కూడా ప్రజలు అర్థం చేసుకోగలరు. అయితే ఇప్పటి వరకు మత రాజకీయాలు చేస్తూ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఇప్పుడు కుల రాజకీయాలు చేస్తూ ఏపీలో కొన్ని ఓట్లను పొందటానికి చూస్తుంది. బీజేపీకి చీప్ సంస్కృతి ఏంటంటే ఈ పార్టీకి ప్రజలందరూ కలిసి ఉంటె నచ్చదు . ఎప్పుడు ఎదో ఒక భావంతో ప్రజలు కొట్టుకు చస్తూ ఉండాలి. ద్వేషాన్ని పెంచడంలో బీజేపీ ముందుంటుంది.
కృష్ణా జిల్లాకు రంగా పేరు??
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కొత్తజిల్లాలను ఏర్పాటు చేసిందని, వాటన్నింటికి కొత్తపేర్లు పెట్టిందని, ఇప్పుడు కృష్ణా జిల్లాకు కూడా వంగవీటి రంగా పేరు పెట్టాలని డిమాండ్ బీజేపీ నాయకుడు జీవీఎల్ డిమాండ్ చేస్తున్నారు. ఈ రాజకీయ నాయకులు ఎంత పనికిమాలిన ఆలోచనా విధానాన్ని ప్రజలకు అలవాటు చేస్తున్నారంటే జస్ట్ పేర్లు పెడితే చాలు ఇంకేమి వద్దని, ఇవి రంగా ఆశయాలు నెరవేరకపోయినా పర్వాలేదు కానీ జస్ట్ పేరు పెడితే చాలానే చీప్ పాలిటిక్స్ ను ప్రజలకు అలవాటు చేస్తున్నారు . బీజేపీ ఇలా పేర్ల రాజకీయం చెయ్యడం చాలా ఇష్టం. దేశంలో చాల రాష్ట్రాల్లో ఇలా రాజకీయాలు చేసి సక్సెస్ కూడా అయ్యింది. అలాంటి రాజకీయాలే ఇప్పుడుద్ ఏపీలో చెయ్యడానికి ప్రయత్నిస్తుంది. అయినా బీజేపీ ఇక్కడ కనీసం డిపాజిట్స్ కూడా రావడం లేదు. అలంటి లీడర్స్ ను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఐన పేర్ల పెట్టడం వల్ల చనిపోయినవాళ్లను గౌరవించినట్టేనని అనుకునే చీప్ మెంటాలిటీ ఉన్నవాళ్లే మన పొలిటిషన్స్.
అసలు కుల సభాలేంటి!!
దేశంలో కులాన్ని రూపుమాపాలని చాలామంది తమ ప్రజలను సైతం లెక్కచెయ్యకుండా పోరాటాలు చేస్తే, ఇప్పుడున్న ఈ పనికిమాలిన రాజకీయ నాయకులూ వచ్చి మళ్ళీ అదే కుల రాజకీయాలు చేస్తున్నారు. మా కులాన్ని ప్రేమిస్తాం, ఇతర కులాన్ని గౌరవిస్తాం అనే సొల్లు మాటను చెప్తూ ఈ రాజకీయ నాయకులు కుల రాజకీయాలు చేస్తూ ఉంటారు. ఈ కుల రాజకీయాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రోత్సహిస్తున్నారు. ఇన్ని కుల సభలు జరుగుతున్నా కూడా అసలు ఇవేంటి, ఇలా చెయ్యడం తప్పని, ఇలా చేస్తే కుల భావన ఇంకా పెరిగి, మళ్ళీ పాత కాలానికి వెళ్తామని ఒక్క నాయకుడు కూడా చెప్పడం లేదు. సరికొత్త రాజకీయాలు చెయ్యడానికి రాజకీయాల్లోకి వచ్చానని చెప్తున్న పవన్ కళ్యాణ్ కూడా ఇలా కుల రాజకీయాలు చెయ్యడం ఏంటని రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.