Ktr: రాజకీయాల్లో ఎప్పుడు ఏ నాయకుడు ఏ పార్టీలో చేరుతారో ఎవ్వరికి తెల్వదు. ఎందుకంటే రాజకీయాలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టీలోకి కూడా సులువుగా వెళ్తున్నారు. ఇలా నాయకులు పార్టీలు మారడం అనేది చాల సర్వసాధారణమైన అంశం. అందుకే రాజకీయ నాయకులంతా నీతిలేని వాళ్ళు ఎక్కడా ఉండరు. అందుకే ఇప్పుడు తెలంగాణాలో మంత్రి కేటీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించారు. రాష్ట్రంలో బీజేపీ బలపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న నాయకులను తెరాసాలోకి తీసుకోవడానికి కేటీఆర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ వేస్తున్న బిస్కెట్లకు చాలామంది బీజేపీ నాయకులు తెరాసలోకి వెళ్తున్నారు. వరంగల్, హైదరాబాద్ కార్పొరేటర్లతో పాటు ఇతర జిల్లాల్లో ఉన్న కౌన్సిలర్లను కూడా తెరాసా పార్టీలోకి తీసుకుంటుంది. ఇలా బీజేపీ ఎక్కడైతే బలంగా ఉందొ అక్కడ ఉన్న బీజేపీ నాయకులకు తెరాసా గాలం వేస్తుంది.
బీజేపీ కూడా చేయగలదా!!
ఇలా వేరే పార్టీలో ఉన్న నాయకులను కొనడం బీజేపీకి వెన్నతో పెట్టిన విద్య. ఇప్పటికే చాల రాష్ట్రలో బీజేపీ అలా చేసి అధికారంలోకి కూడా వచ్చింది. అధికారంలో ఉన్న సీఎంలను కూడా దించేసి కొత్త గవర్నమెంట్ ను స్థాపించగలిగింది. అయితే ఇప్పుడు తెరాస చేస్తున్న రాజకీయాలను ఒకవేళ బీజేపీ రాష్ట్రంలో చేస్తే కేసీఆర్ ను కూడా సీఎం పదవి నుండి దించగలడు. అందుకే కేటీఆర్ ఆకర్ష్ వల్ల బీజేపీ కోపం వస్తే రానున్న రోజులో తెరాసకు ప్రమాదమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఒకవేళ బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేస్తే చాలామంది నాయకులు పార్టీలోకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే తెరాసలో అసంతృప్తిలో ఉన్న నాయకులు ఎక్కువైయ్యారు. అందుకే ఇప్పుడు బీజేపీ కూడా ఆ దిశగా అడుగులు వేస్తుందో చూడాలి.
ఎమ్మెల్యేల్లో కూడా అసంతృప్తి
అయితే ఇప్పుడు తెరాసా ఎమ్మెల్యేలలో చాలామందిలో అసంతృప్తి పెరిగింది. ఇప్పటికే వచ్చిన సర్వేల్లో చాలామంది నాయకులకు మళ్ళీ గెలిచే అవసరం లేదు. పైగా ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికల్లో కూడా చాలామంది మంది నాయకులకు నెగటివ్ రిపోర్ట్స్ వచ్చినట్టు తెలుస్తుంది. అందుకే ఆ నాయకులు ఇప్పుడు వేరే పార్టీల వైపు చూస్తున్నారు. ఒకవేళ అలంటి నాయకులు బీజేపీ వైపు వెళ్తే, రానున్న రోజుల్లో బీజేపీ బలం పెరగడం ఖాయంగా కనిపిస్తుంది. అదే కనుక జరిగితే తెరాసా కు నష్టం జరిగినట్టే. ఎన్నికల సమయం వరకు ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెల్వదు. చూడాలి రానున్న రోజుల్లో తెలంగాణ ఎన్నికల్లో ఏమి జరుగుద్దో.