pawan kalyan

Lokesh: వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ఓడించి, మళ్ళీ అధికారంలోకి రావాలని టీడీపీ చాలా గట్టి ప్రయత్నాలు చేస్తుంది. అందుకే ఇప్పటికే జనసేనతో పొత్తుకు టీడీపీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అలాగే వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి లోకేష్ యువగళం పే పాదయాత్ర కూడా చేస్తున్నారు. ఇప్పటికే పాదయాత్ర స్టార్ట్ అయ్యి, ఒక నెల అవుతుంది. ఈ పాదయాత్రలో లోకేష్ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న తప్పులను ప్రజలకు వివరించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇందులో కొంతవరకు సఫలం కూడా అయ్యాడు. అయితే ఇంకో విషయంలో లోకేష్ టీడీపీ లోకేష్ అధినేత చంద్రబాబు నాయుడుకు చెమటలు పట్టిస్తున్నాడు. గతంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎలాగైతే ప్రవర్తించాడో ఇప్పుడు కూడా లోకేష్ కూడా అలానే ప్రవర్తిస్తున్నాడు. ఇప్పటి వరకు పాదయాత్ర ఒక్క జిల్లా మాత్రమే పూర్తి అయ్యింది కానీ లోకేష్ మాత్రం ఇష్టమొచ్చినట్టు హామీలు ఇస్తున్నాడు.

హామీల యాత్ర

ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో లోకేష్ పాదయాత్ర సాగింది. ఈజిల్లాలోనే లోకేష్ చాల హామీలు ఇచ్చారు. టీడీపీ అధికారంలోకి వస్తే వడ్డెర కులస్తులను ఎస్టీ కుళంలోకి మారుస్తామని, అలాగే ఒక ముస్లిం కాలేజీ ఏర్పాటు చేస్తామని, 2750 రూపాయలుగా ఉన్న వృధ్యాప్య పింఛన్ 3000 రూపాయలుగా మారుస్తానని , అలాగే ఉద్యోగాల నోటిఫికేషన్ పై కూడా హామీలు ఇస్తున్నారు. ఇలా ఒక్క జిల్లాకే లోకేష్ ఇన్ని హామీలు ఇచ్చారు. గతంలో జగన్ ఒక నవరత్నాలు అన్న కార్యక్రమాన్ని ప్రిపేర్ చేసుకొని,వాటినే రాష్ట్రం మొత్తం అమలు చేస్తానని చెప్పాడు. కానీ లోకేష్ మాత్రం ఒక్కో ఒక్కో హామీ ఇచ్చేలా ఉన్నాడు. దింతో చంద్రబాబు నాయుడుకు టెన్షన్ పట్టుకుంది. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే వీటన్నంటిని అమలు చెయ్యకపోతే జనాలు ఏమంటారోనన్న భయం కూడా పట్టుకుంది.

జనసేనకు మిగిలేదేంటి!!

వచ్చే ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. కాబట్టి రెండు పార్టీలు కలిసి మేనిఫెస్టోను ప్రిపేర్ చెయ్యాల్సి ఉంటుంది. లోకేష్ ఇప్పుడే ఇలా ఇష్టమొచ్చిన హామీలన్నీ ఇచ్చేస్తుంటే లాస్ట్ కు అసలు ఏమి మిగిలేలా లేవు. జనసేనకు అసలు మేనిఫెస్టోలో కనీసం చెప్పడానికి కూడా ఒక్క పథకం లాస్ట్ కు మిగిలేలా లేదు. ఎలాగో జనసేన అధినేత ఇప్పుడు మూవీస్ లో చాల బిజీగా ఉన్నాడు కాబట్టి ఎలాగో ఆయనకు మానిఫెస్ట్ ప్రిపేర్ చేసేంత టైం ఉండదు కాబట్టి లోకేష్ యే అన్ని చెప్పేసినా కూడా ప్రాబ్లెమ్ లేదని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయినా ఇప్పుడే రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుంది. ఇప్పుడు వచ్చిరాజకీయ పార్టీలు ఇష్టమొచ్చిన హామీలు ఇస్తే వాటిని ఎలా అమలు చేస్తారో చూడాలి.