PAWAN KALYAN:వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా పవన్ కళ్యాణ్ ను సీఎం చెయ్యాలని జనసేన నాయకులు ప్రయత్నిస్తున్నారు. అయితే ఇప్పుడు జనసేన నాయకులకు, జనసేన కార్యకర్తల కోసం ఇప్పుడు మెగా అభిమానులు కూడా రంగంలోకి దిగారు. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రమే జనసేన కోసం కష్టపడ్డారు. కానీ ఇప్పుడు మొత్తం మెగా అభిమానులందరు రంగంలోకి దిగి, పవన్ కళ్యాణ్ ను సీఎం చెయ్యాలని బలంగా డిసైడ్ అయ్యారు. గతంలో ప్రజారాజ్యం కోసం కష్టపడ్డట్టే ఇప్పుడు జనసేన కోసం కష్టపడుతామని, పవన్ ను సీఎం చెయ్యడమే తమ లక్ష్యమని బలంగా చెప్తున్నారు.

మురళీ ఫార్చున్ హోటల్ లో ఏపీలోని అన్ని జిల్లాల నుంచి పరిమిత సంఖ్యలో మెగా ఫ్యాన్స్‌ను ఆహ్వానించారు. అందరూ కలిసి జనసేన పార్టీకి ఎలా మద్దతుగా నిలవాలన్న అంశంపై చర్చించారు.
మెగా ప్లానింగ్
మెగా అభిమానులందరు ఒక్కటేనని, మా మధ్యన ఎలాంటి గొడవలు లేవని, మెగా అభిమానుల మధ్యన గొడవలు ఉన్నాయని వస్తున్నా వార్తలను నమ్మొద్దని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామినాయుడు తెలిపారు. ప్రతి గ్రామంలో అందరూ కలిసి పని చేయాలని నిర్ణయించామని.. జనసేన ను జనంలోకి తీసుకెళ్లేలా మా వంతు కృషి చేస్తామని ప్రకటించారు. అయితే ఇది తొలి సమావేశం అని.. మరికొన్ని సమావేశాలు అనంతరం కార్యాచరణ సిద్దం చేస్తామని స్వామి నాయుడు ప్రకటించారు. అభిమానులకు, నాయకులకు మధ్య అంతరాలు లేవని పార్టీ ఆదేశాలను పాటిస్తూ ముందుకు వెళతామని ప్రకటించారు.
పొత్తులపై నిర్ణయం
అయితే మెగా అభిమానులు పవన్ కంటే కూడా చాలా స్పష్టంగా ఉన్నారు. పార్టీ యొక్క పొత్తులతో తమకు ఎలాంటి సంబంధం లేదని, తాము కేవలం పవన్ కోసం మాత్రమే పని చేస్తామని ఖచ్చితంగా చెప్తున్నారు. ఇదే స్పష్టతతో పవన్ కూడా బీజేపీతో పొత్తును వదులుకొని తన కోసం తానూ పని చేసుకుంటూ, పార్టీని బలోపేతం చేసుకుంటే మంచిది. ఒకవేళ మెగా అభిమానులు వేసుకున్న వ్యూహం సరిగ్గా పని చేస్తే జనసేనకు రానున్న రోజుల్లో మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉన్నాయ్.