Roja: ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడే ఏ ఒక్క పని కూడా చెయ్యకుండా జాగ్రత్త పడుతున్న మినిస్టర్ రోజా ఏపీ రాజకీయాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ఇలాంటి రోజా ప్రజల సమస్యలపై ఎప్పుడూ మాట్లాడారు ఎందుకంటే ఆమెకు వేరే పారీట్ నాయకులను తిట్టడానికి లేదా జగన్ కు భజన చెయయడానికే టైం ఉండటం లేదు. అందుకే ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఇష్టమొచ్చినట్టు అసెంబ్లీలో తిడుతూ, జగన్ మోహన్ రెడ్డికి భజన చేస్తూ, అసెంబ్లీలో టైం పాస్ చేస్తున్నారు. ఏపీ అభివృద్ధి విషయంలో జగన్ చేసిన మంచి పనుల గురించి రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ… జగన్ అభివృద్ధి ట్రెండ్ ను చేస్తాడని భజన మొదలుపెట్టారు.ఈ చివరికి బాబును, పవన్ కళ్యాణ్ ను తిట్టడంతో ముగిసింది.

బాబు వేస్ట్, పవన్ జీరో

జగన్ ను పొగిగితే మాత్రమే సరిపోదు, దానితోపాటు చంద్రబాబు నాయుడును, పవన్ కళ్యాణ్ ను తిడితేనే నెక్స్ట్ డే పేపర్స్ లో, సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని ఆమె ఆలోచన. అసెంబ్లీలో గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌పై చర్చలో మాట్లాడిన రోజా 40 ఇయర్స్‌ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నిర్వహించిన సదస్సుకు ఎప్పుడూ ఇలాంటి దిగ్గజ పారిశ్రామిక వేత్తలు రాలేదు. 44 నెలల్లోనే తన నాయకత్వంలో, తన పరిపాలనతో ఇంతమంది పారిశ్రామికవేత్తలను ఒకే వేదికపైకి తెచ్చారంటే.. సీఎం వైయస్‌ జగన్‌ ఇమేజ్‌ దేశ వ్యాప్తంగా ఎంత గొప్పగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చని చెప్పుకొచ్చారు. అలాగే మొన్న పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ… దారినపోయే కంపెనీస్ తెచ్చారని అంటున్నారని, అంబానీ, జిందాల్, దాల్మియా లాంటి కంపెనీస్ ని దారినపోయే కంపెనీస్ అంటున్నాడంటే పవన్ కు ఉన్న నాలెడ్జ్ జీరోనని రోజా వ్యాఖ్యానించారు. ఇలా కేవలం తిడుతునో, పొడుగుతూనో ఇన్ని సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నారంటే రోజా గ్రేట్ అనే చెప్పాలి.

ప్రజల సమస్యల గురించి తెలుసా!!

రోజా ఎప్పుడు న్యూస్ లోకి వచ్చినా కూడా వాళ్ళను, వీళ్ళను తిడుతూనే వస్తుంది కానీ ఎప్పుడూ కూడా ప్రజల సమస్యల గురించి మాట్లాడి వార్తల్లో ఎప్పుడూ రాలేదు. ఆమె కనీసం ఒక్కసారి కూడా సీఎం జగన్ దగ్గర ప్రజల గురించి కానీ, ప్రజల సమస్యల యూ గురించి కానీ మాట్లాడిందా అని డౌట్. ఎందుకంటే ఎప్పుడు భజన చెయ్యడం తప్పా ప్రజల గురించి మాట్లాడిన ఒక్క సంబర్భం కూడా లేదు. అందుకే ఆమె ఎప్పుడన్న ప్రజల గురించి మాట్లాడితే వినాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చుస్తునారు. అయితే అది ఎప్పటికీ నెరేవేరని ఒక కోరికని వాళ్ళక్కూడా తెలుసు.