Balineni: ప్రకాశం జిల్లాలో తాజాగా వెలుగు చుసిన అంశం నకిలీ భూపత్రాలు. ఈ విషయం ఇప్పుడు ప్రకాశం జిల్లాలో, అక్కడి వైసీపీ నాయకులు మధ్య తీవ్రదుమారాన్ని రేపుతోంది. అయితే ఈ విషయంలో పోలీసుల వ్యవహారశైలిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో దోషులను పట్టుకునే విషయంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరు సరిగ్గా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నకిలీ భూపత్రాల విషయంలో పోలీసులు ప్రవర్తిస్తున్న తీరును నిరసిస్తూ… ఆయనకు ప్రభుత్వం ఇచ్చిన గన్ మెన్ లను ప్రభుత్వానికి సరెండర్ చేస్తున్నట్టు డీజీపీకి లేఖ రాశారు.

ఈ విషయం తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని, తన రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎప్పుడు చూడలేదని, ఈ నకిలీ భూపత్రాల దందాలో ఎవరు ఉన్నా వాళ్ళను వదిలిపెట్టవద్దని, వాళ్ళు అధికార పార్టీకి సంబంధించిన వారైనా వదిలిపెట్టవద్దని డీజీపీకి ఇచ్చిన లేఖలో పేర్కొన్నారు. ఇలాంటి విషయాలను లాస్ట్ ఫోర్ ఇయర్స్ నుండే ఎక్కువగా జరుగుతున్నాయని, ఈ విషయంలో పోలీసులు తన మాటలను పెడచెవిన పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ నకిలీ భూపత్రాల కేసులు పోలీసులు ఇప్పటికే 10మందిని అరెస్ట్ చేశారు. ఈ విషయంపై ఇంకా విచారణ జరుగుతూనే ఉంది. అయితే ఈ విషయంలో తన పక్కన ఉన్నవారినైనా వదిలిపెట్టవద్దని బాలినేని తెలిపారు. ఎమ్మెల్యే నిరసనకు పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి.