ఎమ్మెల్సీ గుత్తా విషయంలో కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. గుత్తా కూడా పదవి ఉంటుందా పోతుందా అనే విషయంలో కేసీఆర్ స్పష్టతనివ్వకపోవడంతో టెన్షన్ లో ఉన్న పరిస్థితి ఉంది. అప్పటి రాజకీయ పరిస్థితులకు ఇప్పటి రాజకీయ పరిస్థితులకు చాలా తేడా ఉంది. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల ఆధారంగా ఏమైనా మార్పులు చేస్తారా లేక గుత్తానే కొనసాగిస్తారా అన్నది చూడాల్సి ఉంది. అయితే ఇప్పటివరకు ఈ విషయంపై ఎమ్మెల్సీ గుత్తా సుఖేంధర్ రెడ్డి గాని, టీఆర్ఎస్ నేతలేవరూ మాట్లాడలేదు. ఒకవేళ గుత్తా పదవి పీకేస్తే మరో కలకలం మొదలయ్యే అవకాశం ఉంది. మరల గుత్తా అసంతృప్తి గా భావిస్తే టీఆర్ఎస్ కు మరో నేత దూరమయ్యే అవకాశం ఉంటుంది. పార్టీ పరంగా టీఆర్ఎస్ కు ఇప్పుడు గడ్డు కాలం నడుస్తోంది.

ఎమ్మెల్సీ పదవిపై తెరాసలో గట్టి పోటీ ఉండే అవకాశం

ఈ సమయంలో కేసీఆర్ ప్రతి నిర్ణయాన్ని చాలా ఆచీతూచీగా తీసుకుంటాడు. మరి గుత్తాకు మరో సారి పదవి ఇవ్వాలని కేసీఆర్ నిర్ణయిస్తే మరో సారి ఎమ్మెల్సీ గా గుత్తా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కనిపిస్తోంది. అయితే టీఆర్ఎస్ లో ఉన్న మరో నేత కూడా ఎమ్మెల్సీ సీటుపై గురి పెట్టడంతో మరి కెసీఆర్ ఎటువైపు గురి పెడతాడో చూడాల్సి ఉంది. అంతేకాక ఇప్పుడు ఈటెల అంశం కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ, పార్టీ పరమైన సమస్యలు ఉండడంతో ఎమ్మెల్సీ ఎన్నిక నిర్ణయాన్ని వాయిదా వేసే అవకాశం కనిపిస్తోంది. ఈ సమయంలో నిర్ణయం తీసుకుంటే మరో కొత్త సమస్యలు పునరావృతమయ్యే అవకాశం ఉంది. కావున ఇప్పడు ఈ ఎమ్మెల్సీ అంశాన్ని కొంత మేర వాయిదా వేసే అవకాశాన్ని కెసీఆర్ పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకున్నా పెద్దగా రాజకీయంగా కెసీఆర్ కు ఒరిగేదేముండదు . అంతేకాక ఈ సమయంలో ఎన్నికల పై దృష్టి పెడితే ప్రతి పక్షాల విమర్శలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా గుత్తా కొనసాగింపుపై కెసీఆర్ నిర్ణయంపైనే ఆధారపడి ఉంది.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 30, 2021 at 6:41 సా.