ఎంపీ రఘురామకృష్ణంరాజు అరెస్ట్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. జగన్ ప్రభుత్వంపై గత కొన్ని నెలలుగా ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, ముఖ్యమంత్రులని విమర్శిస్తూ రాజకీయాలలో హాట్ టాపిక్ గా నిలుస్తూ వస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏ కొత్త పథకాన్ని చేపట్టినా దానిని తనదైన శైలిలో విమర్శిస్తూ ప్రజల్లో, మీడియాలో అభాసుపాలు చేయడానికి ప్రయత్నిస్తున్నాడనేది వైసీపీ నాయకుల ఆగ్రహం. అయితే తాజాగా రఘురామ కృష్ణంరాజును హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ అరెస్ట్ వ్యవహారంపై టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది
వైసీపీ అరాచక పాలనకు నిదర్శనమని, ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం సిగ్గుచేటు? క్షత్రియులపై వైసీపీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతోందని, మొన్న అశోక్ గజపతిరాజు రాజుపై అక్రమ కేసు పెట్టారని, ఇవాళ రఘురామ కృష్ణంరాజుని అరెస్ట్ చేశారు? రేపు మరొకరిని అరెస్ట్ చేస్తారు.
క్షత్రియుల ఓర్పు, సహనాన్ని పరీక్షించవద్దు
క్షత్రియులుసర్వశక్తివంతులు, సమస్త దుష్టత్వం నుండి రక్షించి పరిపాలించువాడు క్షత్రియుడు. సమాజ సేవ చేస్తూ.. రాష్ట్రాభివృద్దికి పాటు పడేవాళ్లని వారన్నారు. అలాంటి వారిపై కక్ష్య సాధింపు చర్యలు సరికాదు. క్షత్రియుల ఓర్పు, సహనాన్ని పరీక్షించొద్దని, రఘురామకృష్ణంరాజు పై పెట్టిన అక్రమ కేసులు వెంటనే ఎత్తి వేసి విడుదల చేయాలని, లేకపోతే తరవాత జరిగే పరిణమాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అన్నారు. జగన్ బెయిల్ రద్దు చేయాలని రఘురామ కృష్ణం రాజు వేసిన పిటిషన్ ఈ నెల 17 న విచారణకు వస్తోందని, ఆ కేసులో లాయర్లు వాదించకుండా భయపెట్టేందుకు అరెస్ట్ చేశారని, కుల మతాల మధ్య విబేధాలు సృష్టించేలా వ్యాఖ్యలు చేశారని రఘురామకృష్ణం రాజుని అరెస్టు చేశారని, రాజ్యాంగ బద్ధ పదవుల్లో ఉన్న ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ ని, జడ్జిలను కులం పేరుతో దూషించిన ముఖ్యమంత్రి జగన్ పై, వైసీపీ మంత్రులపై ఎందుకు సీఐడీ కేసులు నమోదు చేయలేదని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణరాజు అభిప్రాయపడ్డారు.