వైసీపీ పాలనలో వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం నుంచి సాయం కరువైందని, అన్నపూర్ణగా పేరొందిన ఆంధ్రప్రదేశ్ లో అన్న దాతల పరిస్థితి దయనీయంగా మారిందని జగన్ రెడ్డి రెండేళ్ల పాలనలో ఏ ఒక్క రైతూ, వ్యవసాయ కూళీ సంతోషంగా లేరని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు.   చిత్తూరు జిల్లాలో మామిడి పంటకు సరైన గిట్టుబాటు ధరలు లేక మామిడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ హయాంలో చిత్తూరు జిల్లాలో తోతాపురి రకం టన్ను రూ. 20 వేలు, బేనీషా రకం రూ. 40 నుండి 50 వేలు, మల్లిక రకం రూ. 60 వేలు, ఇమాంపసంద్ రకం రూ. 90 వేలు, నీలం రకం రూ. 30 నుండి 40 వేలు దాకా ధర ఉంటే, నేడు వైసీపీ ప్రభుత్వ చర్యలతో తోతాపురి రకం రూ. 6 నుండి 8 వేలు, బేనీషా రకం రూ.9 వేలు, మల్లిక రకం రూ. 25 వేలు, నీలం రకం రూ.18 వేలకు తగ్గిపోయాయి. చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి, ఆయన సోదరుడు ద్వారకనాథ్ రెడ్డి నేతృత్వంలో గుజ్జు పరిశ్రమల యజమానులు అందరూ సిండికేట్ గా మారి మామిడి రైతుల కష్టాన్ని, శ్రమను దోచుకుంటున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతుంటే వైసీపీ నేతలకు కమీషన్లు కావాలా? రైతుల శ్రమను దోచుకోవడం దుర్మార్గం. ప్రభుత్వం రూ.9కి కొంటున్నామని చెబుతున్నప్పటికీ ఆ ఆదేశాలు ఎక్కడా అమలుకావడంలేదు. కేజీకీ రూ.7 మాత్రమే ఇస్తున్నారు. మిగిలిన మొత్తం ఎవరి జేబులోకి వెళ్తోంది?

లాక్ డౌన్ వల్ల ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు రాకపోవడం, రవాణా సౌకర్యం లేకపోవడంతో దళారులు చెప్పిన రేటుకు రైతులు పంటను అమ్మక తప్పడం లేదు. పూతలపట్టు, చంద్రగిరి, గంగాధర నెల్లూరు, పీలేరు, మదనపల్లి నియోజకవర్గాల్లో సుమారు 5 వేల ఎకరాల్లో మామిడి రైతులు నష్టపోయారు. 2014-19 వరకు టీడీపీ ప్రభుత్వం మామిడి రైతుకి కే.జీకి రూ.2.5 సబ్సిడీ ఇచ్చి జ్యూస్ ఫ్యాక్టరీలతో మామిడి పంట కొనేలే చేసి రైతులను అన్ని విధాలా ఆదుకున్నాం.
కానీ వైసీపీ ప్రభుత్వం ఆ సబ్సిడీ ని ఎత్తేసి మామిడి రైతులకు అన్యాయం చేసింది. ముఖ్యమంత్రి దీనిపై దృష్టి పెట్టి మామిడి రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించాలి. చిత్తూరు జిల్లాలో మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి. తోతాపురి రకం కే.జీ రూ.15 నుంచి రూ.20లకు కొనుగోలు చేయాలి. రోజువారీ మామిడి ధరలను కొనుగోలు కేంద్రాల వద్ద ఎలక్ట్రానిక్ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేసి ధరల వివరాలను రైతులకు తెలపాలి. రైతులు-ప్రభుత్వ భాగస్వామ్యంతో చిత్తూరు జిల్లాలో మరో రెండు భారీ గుజ్జు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి. మామిడి రైతులకు ధరలస్థీరీకరణ సంస్థను ఏర్పాటు చేయాలి. మామిడి రైతుల డిమాండ్లు పరిష్కరించే వరకు టీడీపీ పోరాటం ఆగదని నారా చంద్రబాబు అన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 24, 2021 at 6:54 సా.