India:కొత్త వాహన చట్టం వచ్చిందిరో, ఫైన్స్ మాములుగా లేవుగా!!

Arjun

India:మన దేశంలో రోడ్స్ ఎలా ఉన్నా కూడా ఫైన్స్ కోసం కాబినెట్ కొత్త చట్టాన్ని మాత్రం ఆమోదించింది. ఈ ఫైన్స్ కూడా ఒకరకంగా మంచిదే అనుకోవచ్చు. ఎందుకంటే కొత్త వరకు ప్రమాదాలను అరికట్టడానికి ఉపయోగపడొచ్చు. అయితే నూతన వాహన చట్టంలో ఫైన్స్ మాత్రం రూల్స్ అతిక్రమించే వాళ్లకు చుక్కలు చూపించేలా ఉన్నాయ్. ఈ ఫైన్స్ చుస్తే మహర్షి మూవీలో మహేష్ బాబు విధించిన ఫైన్స్ గుర్తుకు వస్తాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ మూవీ నుండే ఇన్స్పిరేషన్ అనుకోవాలి.

new traffic rules are introduced in india

నూతన చట్టం:

1 . ఒకవేళ మొబైల్ మాట్లాడుతూ పట్టుబడితే 5000 రూపాయలను ఫైన్ గా విధించే అవకాశం ఉంది. గతంలో ఈ ఫైన్ రూ. 1000 గా ఉండేది కానీ ఇప్పుడు ఐదు రేట్లు పెరిగింది. అయితే డ్రైవ్ చేస్తూ ఒకవేళ మెసేజ్ చేస్తూ ఉంటె ఎలాంటి ఫైన్ ఉంటుందనే అంశాన్ని మాత్రం ఇందులో ప్రస్తావించలేదు.

2. ఒకవేళ మద్యం సేవించి, వాహనం నడుపుతూ పట్టుబడితే గతంలో రూ. 2000 ఉండే ఫైన్ ని ఇప్పుడు ఐదు రేట్లు పెంచుతూ 10000 చేశారు. ఈ సవరణను మాత్రం సోషల్ మీడియాలో కూడా మెచ్చుకుంటున్నారు. ఎందుకంటే ప్రతి నాలుగు నిమిషాలకు ఒక ఆక్సిడెంట్ జరుగుతూ ఉంది, అందులో దాదాపు ప్రతి ఆక్సిడెంట్ లో మద్యం వల్ల జరిగినట్టే ఆధారాలు ఉన్నాయ్.

3. మైనర్ బాలుడు, బాలిక వాహనం నడుపుతూ పట్టుబడితే, వాళ్ళ తల్లితండ్రుల్లో ఒకరికి రూ. 25000 ఫైన్ అలాగే 3 సంవత్సరాలు జైలు శిక్ష. ఇది గత చట్టంలో లేదు.

4. తరచుగా ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించే వాళ్లకు రూ. 25000 నుండి లక్ష వరకు ఫైన్ పడే అవకాశం ఉంది. ఎన్నిసార్లు నియమాలను ఉల్లంఘించారు అనే దానిపై ఆధారపడి ఫైన్స్ విధించడం జరుగుతుంది.

5. ఓవర్ స్పీడ్ కు గాను లైట్ మోటార్ వెహికల్స్ గాను రూ. 100 గా ఉన్న ఫైన్ 300 కు పెంచారు. అలాగే మీడియం పాసెంజర్ వాహనాలకు 1000 ఫైన్ విధిస్తున్నారు.

6.ఓలా, ఉబెర్ వాహనాలు కూడా ఈ చట్టం పరిధిలోకి వస్తాయి.

7. గవర్నమెంట్ అధికారులు ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే డబల్ ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

చట్టంలో చేసిన మార్పులను క్యాబినెట్ ఆమోదించింది. అయితే సంబంధిత యూనియన్ మినిస్టర్ రానున్న పార్లమెంట్ సమావేశాల్లో బిల్ ను ప్రవేశపెట్టనున్నారు. అయితే కాంగ్రెస్, డీఎంకే, సిపిఐ లాంటి పార్టీలు ఈ మార్పులను వ్యతిరేకించారు.

- Advertisement -