కృష్ణపట్నంలో ఆనందయ్య కరోనా మందు వ్యవహారం ఎంతలా జనాదరణ పొందిందో మనం చూశాం. అయితే ప్రభుత్వం ఆనందయ్యను కరోనా మందు నిలిపివేతను నిలిపివేయాలని చెప్పిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి, ఆనందయ్య విలేఖరుల సమావేశం ఏర్పాటు చేశారు.  ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందుకు విశేషమైన ఆదరణ లభించడంతో ప్రజలకు చేరువ చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టిపెట్టారని, ఆనందయ్య తయారు చేస్తున్న ఆయుర్వేద మందు యొక్క శాస్త్రీయతను అధ్యయనం చేయడానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయుష్ బృందాన్ని,ఐ.సీ.యం.ఆర్. బృందాన్ని హుటాహుటిన నెల్లూరుకి పంపించడం జరిగిందని,  ఆయుష్ బృందం ఐసీఎంఆర్ కమిటీ సభ్యులు అధ్యయనం పూర్తి చేసి, నివేదికలు అందించిన వెంటనే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. నిపుణుల బృందం అధ్యయనం పూర్తి చేసిన తర్వాత మందు వాడటం వల్ల ఎటువంటి ఇబ్బందులు లేవని తేల్చి చెప్పితే, మందు పంపిణీకి అడ్డంకులు తొలిగినట్లేనని,  ప్రభుత్వం నుండి అనుమతి లభించిన తర్వాత విధివిధానాలు రూపొందించి, కోవిడ్ నిబంధనలు అనుసరించి, మందు పంపిణీని చేపట్టడం జరుగుతుందని ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు.

మందు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నా

అనంతరం ఆనందయ్య మాట్లాడుతూ…ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చొరవతో ఎటువంటి జాప్యం లేకుండా వెంటనే ఆయుష్ బృందం, ఐసీఎంఆర్ బృందాలు నెల్లూరులో పర్యటించి, మందు తయారీ విధానాన్ని పరిశీలించడంతో అధ్యయనం ప్రక్రియ వేగవంతమైందని నన్ను ఎవ్వరూ నిర్బంధించలేదు.నేను స్వేచ్ఛగా, స్వతంత్ర్యంగా తిరుగుతున్నానని, నేను అందిస్తున్న వైద్యం పట్ల ఆసక్తి కనబరిచి అధ్యయనం చేయడానికి నిపుణుల బృందాన్ని పంపించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు అని అన్నారు. ఆయుర్వేద మందు తయారు చేయడంలో, ప్రజలకు అని అందించడంలో నాకు అండగా నిలిచి నన్ను వెన్నుతట్టి ప్రోత్సహించిన, మా సర్వేపల్లి శాసనసభ్యులు కాకాణి గోవర్ధన్ రెడ్డి గారికి నా కృతజ్ఞతలు అని, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు, శాసనసభ్యునిగా గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నంత కాలం ఎవ్వరూ నన్ను ఇబ్బందులపాలు చేయ్యలేరు. నిపుణుల బృందం నివేదిక అందించి, ప్రభుత్వం అనుమతించిన వెంటనే, మందు తయారు చేసి, పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఆనందయ్య అన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 24, 2021 at 12:14 సా.