బీజేపీ హయాంలోని కేంద్ర ప్రభుత్వం ఏడేళ్ళ పాలనలో కేవలం ప్రచారానికి మాత్రమే పరిమితం అయిందని, ప్రజా సంక్షేమం కోసం కేంద్రం చేసిందేమీ లేదని ఎమ్మెల్యే శ్రీ జోగురామన్న గారు స్పష్టం చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన…కేంద్రం ఏడేళ్ళ పాలనపై తీవ్ర విమర్శలు గుప్పించారు. మేక్ ఇన్ ఇండియా వంటి నినాదాలు కేవలం ప్రచారానికే పరిమితం చేశారని, కాంగ్రెస్ హయాంలో రక్షణ రంగంలో 41 శాతం ఉన్న విదేశీ పెట్టుబడులు 74 శాతానికి పెంచి… మేక్ ఇన్ ఇండియా ప్రచారాన్ని చేస్తున్నారని అన్నారు. దాదాపు నాలుగు లక్షల కోట్ల నల్లధనాన్ని బయటకు తీస్తామని నోట్ల రద్దు చేసినా ఫలితం శున్యమేనని పేర్కొన్నారు. దేశంలోని అన్ని రంగాలను తీవ్ర సంక్షోభంలోకి నెట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదేనని ఎద్దేవా చేశారు. ప్రచారానికి, ఎన్నికలపై సారించిన దృష్టి దేశ అభివృద్దివైపు పెట్టలేదని ఆరోపించారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలను అనేక మార్లు కేంద్ర మంత్రులు ప్రశంసించినా వాటికి నిధులు మంజూరు చేయడం లేదని, లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జాతీయ హోదా కల్పించడం లేదని మండిపడ్డారు.

బీజేపీ నాయకులకు అసలు అభివృద్ధి అంటే తెలుసా: మాజీ మంత్రి జోగు రామన్న 

గతంలో ఎన్నడూ లేని విధంగా నిత్యావసర సరకుల ధరలను పెంచి సామాన్యుని జీవనాన్ని మరింత సంక్లిష్ట పరిస్థితుల్లోకి తీసుకేల్తున్నారని అన్నారు. గత ప్రభుత్వాల కంటే బీజేపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. కార్పోరేట్లకు అనుకూలంగా వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టారని, రైతులను ఆదుకోవల్సింది పోయి.. వారికి మరింత ఇబ్బందులు కలిగిస్తున్నారని ఆరోపించారు. నిరుద్యోగ యువతీ యువకులకు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి.. నిరుద్యోగ శాతాన్ని రెండు నుండి ఎనిమిదికి పెంచారని అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్, వంట నూనె ల ధరలను భారిగా పెంచి.. సామాన్యుని నడ్డి విరుస్తున్నారన్నారు. కరోనా రెండవ వేవ్ తీవ్రత గురించి నిపుణులు హెచ్చరించినా కేవలం ఎన్నికలపైనే దృష్టి సారించి, దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టారని పేర్కొన్నారు. అన్ని రంగాలను నాశనం చేస్తూ అభివృద్ధి అంటూ ప్రచారం చేస్తున్నారని, బీజేపీ నాయకులకు అసలు అభివృద్ధి అంటే తెలుసా అని ఎద్దేవ చేశారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on జూన్ 1, 2021 at 5:43 సా.