Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాలలో కూడా ఎంతో చురుగ్గా పాల్గొంటున్నారు. జనసేన పార్టీని స్థాపించిన అనంతరం ఈయన పెద్ద ఎత్తున ప్రజలలోకి వెళ్తూ ప్రజల సమస్యలను తెలుసుకొని అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఉన్నారు.ఇలా పవన్ కళ్యాణ్ తరచూ అధికార పార్టీని ప్రశ్నించడంతో అధికార పార్టీ నేతలు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత విషయాలను గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయనని దూషిస్తున్నారు. వైసిపి టూరిజం శాఖ మంత్రి రోజా మెగా బ్రదర్స్ ని ఉద్దేశిస్తూ..మెగా బ్రదర్స్ రాజకీయాలలో ఇండస్ట్రీలో కొనసాగుతున్న సొంత జిల్లాలలో కూడా గెలవలేక పోతున్నారని అందుకు గల కారణం ప్రజలకు ఎలాంటి సేవ చేయకపోవడమే అంటూ ఎద్దేవా చేశారు.
ఈ క్రమంలోనే రోజా వ్యాఖ్యలపై ఇప్పటివరకు నాగబాబు చిరంజీవి ఇద్దరు స్పందించారు. అయితే యువశక్తి పేరుతో పవన్ కళ్యాణ్ నిర్వహించిన భారీ బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ రోజా చేసిన వ్యాఖ్యలపై స్పందించి తనకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.తాను ప్రజల సమస్యలను తీర్చడానికి ఒంటరిగా పోరాటం చేస్తానని ఒంటరిగానే ఎలక్షన్లలో నిలబడతానని తెలిపారు. అయితే తనకు గౌరవం ఇచ్చి పొత్తు కుదుర్చుకున్న వారితో తాను పొత్తుకు సిద్ధమని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా తెలియజేశారు.
Pawan Kalyan: సన్నాసి వెదవలతో మాటలు పడాల్సి వస్తుంది…
ఇక ప్రజల కోసం తాను ఎంతో కష్టపడుతున్నప్పటికీ కొందరు మాత్రం తనని తిడుతున్నారని తెలిపారు.ఇక రోజాను డైమండ్ రాణితో పోలుస్తూ చివరికి ఆ రోజాతో కూడా మాటలు పడాల్సి వస్తుంది. ఛీ… నా బతుకు చెడ అంటూ పవన్ కళ్యాణ్ రోజాను డైమండ్ రాణి అంటూ ఆమెకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.అదేవిధంగా ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం గత కొన్ని సంవత్సరాల నుంచి ప్రతి ఒక్క సన్నాసి వెధవతో కూడా తాను తిట్లు తింటున్నానని ఈ సందర్భంగా పవన్ తెలిపారు. ప్రజా సంక్షేమం కోసం తాను ఒంటరిగానైనా ఎంతవరకు ఆయన పోరాటం చేయడానికి వెనకాడనని,ఇప్పటికే రెండు ముక్కలుగా మారిన ఆంధ్రప్రదేశ్ ను జగన్ మూడు ముక్కలు చేయాలని చూస్తున్నారు అంటూ తాను ప్రశ్నిస్తే వాళ్ళు మాత్రం తన మూడు పెళ్లిళ్ల గురించి ప్రస్తావనకు తీసుకువస్తున్నారని పవన్ మండిపడ్డారు.మొత్తానికి యువశక్తి కార్యక్రమంలో వైసిపి నేతలపై పవన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.