Pawan Kalyan: ప్రముఖ సినీ నటుడు జనసేన పార్టీ అధ్యక్షుడు అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఆయన అటు రాజకీయాలు, ఇటు సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఏపీలో సీరియస్ గా తన రాజకీయాలు నడుపుతూ.. అలాగే హైదరాబాద్లో సినిమా షూటింగ్ లో కూడా పాల్గొంటున్నాడు.
అయితే జనసేనాని భద్రత విషయంలో మాత్రం ఆయన అనుచరులు అభిమానులు కొన్ని రోజులుగా ఆందోళనలో ఉన్నారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కు హాని కలిగించేందుకు కొంతమంది ప్రయత్నిస్తున్నారని జనసేన పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే హైదరాబాదులో పవన్ కళ్యాణ్ నివాసం ఉంటున్న ఇంటి వద్ద కొందరు రెక్కి నిర్వహించారని.. పవన్ కళ్యాణ్ పై దాడి చేయడానికి కుట్ర పన్నుతున్నారని గతంలో నెల రోజుల క్రితం జనసేన పార్టీ వర్గాలు ఆరోపించిన విషయం మనందరికీ తెలిసిందే.
అయితే దీనిపై విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి అయిన కిషన్ రెడ్డి కూడా అప్పట్లో స్పందించాడు. దీంతో తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగి పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద ఎలాంటి ఎక్కి జరగలేదని తేల్చి చెప్పేశారు. అలాగే కొంతమంది యువకులు పవన్ ఇంటిదగ్గర ఆయన సెక్యూరిటీ సిబ్బందితో గొడవకు దిగారు.. అంతేకానీ వాళ్లు ఎలాంటి రెక్కీ నిర్వహించలేదని తెలంగాణ పోలీసులు స్పష్టం చేశారు.
అయినప్పటికీ జనసేనాని భద్రత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని జనసేన పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కు విపరీతమైన సెక్యూరిటీ వింగ్ లో కొత్తగా సిబ్బంది ఏర్పాటు చేశారనే వార్త వైరల్ అవుతుంది. అయితే జనసేనాని భద్రత కోసం ఇండియన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ విభాగంలో పనిచేసిన వాళ్ళలో 10 మంది మాజీ ఉద్యోగులను నియమించుకున్నారని సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తోంది.
దీనికి సంబంధించి సెక్యూరిటీ సిబ్బంది ఇంటి బయట నిలబడి చర్చించుకుంటున్న ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అయితే ఈ సెక్యూరిటీ సిబ్బంది మాటల ప్రకారం.. త్వరలోనే తమ పార్టీ నుంచి ఒక అధికారిక ప్రకటన వస్తుందని అంటున్నారు. అయితే ఇందులో ఉన్న నిజమెంతో తెలియదు కానీ.. పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం పవన్ కళ్యాణ్ భద్రతపై పార్టీ చాలా జాగ్రత్తగా తీసుకుంటుంది అంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Pawan Kalyan: వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్న పవన్ సినిమా..
ఇక పవన్ సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా షూటింగ్లో పాల్గొంటూనే రాజకీయపరమైన అంశాలను కూడా చూసుకుంటున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ అభిమానులు ఎలక్షన్స్ తో పాటు ఈ సినిమా కోసం కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.