Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక నటుడుగా ఎంత పేరు సంపాదించుకున్నాడో చూసాం. అయితే ఇటువంటి పేరునే రాజకీయంలో కూడా సంపాదించుకోవాలి అని పవన్ బాగా తాపత్రయం పడుతున్నాడు. ఒక వైపు సినిమాలలో బిజీగా ఉంటూనే మరోవైపు రాజకీయాలలో కూడా సమయాన్ని కేటాయిస్తున్నాడు.
చాలావరకు సినిమాల కంటే ఎక్కువగా రాజకీయాల వైపే సమయాన్ని గడుపుతున్నాడు పవన్. ఇక ఇటీవలే పవన్ ఓ వేదికగా తను రాజకీయపరంగా ఫెయిల్ అయ్యాను చేసిన కామెంట్స్ ఎంతలా వైరల్ అయ్యాయో చూసాం. నిజానికి ఆయన కొట్టే డైలాగులు మాత్రం సినిమా స్టైల్ లా ఉంటాయి. చాలావరకు ఆయన స్పీచ్ వింటే మాత్రం సినిమాల్లో డైలాగులు చెప్పినట్లుగానే అనిపిస్తూ ఉంటాయి.
ఇదంతా పక్కన పెడితే.. పవన్ రాబోయే ఎన్నికల గురించి మాత్రం బాగా తాపత్రయ పడుతున్నాడు. పైగా ఎన్నికల కోసం ముందుగానే ఒక వాహనాన్ని కూడా తయారు చేయించుకున్నాడు. ఇక ఆ వాహనం మిలిటరీ ట్రక్ మాదిరిగా ఉండగా దానికి సంబంధించిన ఫోటోలను ఆయన తన సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు. ఇదే కాకుండా ఆయన ఒక వీడియో కూడా షేర్ చేయటంతో అది కూడా చాలా ఓవర్గా ఉంది అని అపోజిషన్ పార్టీ వాళ్లు విమర్శలు చేస్తున్నారు.
Pawan Kalyan: పవన్ పై విమర్శలు చేస్తున్న వ్యతిరేకులు..
అయితే పవన్ తన రథానికి వారాహి అని పేరు పెట్టగా.. యుద్ధానికి వారాహి సిద్ధం అంటూ వీడియోలు వదిలారు. ఇక అందులో పవన్ తన బాడీగార్డ్ లను మిలిటరీ జవాన్లు మాదిరిగా చూపించాడు. ట్రక్కుకు ఇరువైపులా సైనికుల మాదిరిగా గార్డులను పెట్టడంతోపాటు మరి కొంతమంది సెక్యూరిటీ గార్డులను పంజాబీ గెటప్ లలో తయారు చేయించి నిలబెట్టించాడు. ఇక పవన్ యుద్ధానికి వెళ్తున్న వాడిలా సినిమా స్టైల్ లో ఫోజులు కూడా ఇచ్చాడు. దీంతో ఈ వీడియోని చూసిన పవన్ వ్యతిరేకులు దీనికి ఇంత రేంజ్ అవసరమా అంటూ బాగా ట్రోల్స్ చేస్తున్నారు. ఇక ఆయన అభిమానులు మాత్రం అదిరిపోయింది అంటూ సపోర్ట్ చేస్తున్నారు.