Pm Modi: ప్రధాని మోడీ తల్లి హీరాబెన్ ఇవ్వాళా అహ్మదాబాద్ లోని ఒక హాస్పిటల్ లో చికిత్స పొందుతూ మరణించారు. ఈ సందర్భంలో మోడీ తన తల్లి తనకు చెప్పిన మాటలను గుర్తు చేసుకున్నారు. మోడీ ట్వీట్ లో….”వంద సంవత్సరాలు జరుపుకున్న తన తల్లి ఈరోజు దేవుడి పాదాల దగ్గరకు చేరుకుందని, జీవితాంతం విలువలకు కట్టుబడి, క్రమశిక్షణతో, నిబద్దతతో జీవించిందని “తెలిపారు. అలాంటి తల్లిని ఇప్పుడు కోల్పోయి ఎంతో వేదనకు గురి అవుతున్నారు. హీరాబెన్ మొన్న జరిగిన గుజరాత్ ఎన్నికల్లో కూడా తన ఓటును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల సమయంలో మోడీ వెళ్లి హీరాబెన్ ను కలిశాడు.
హీరాబెన్ డీటెయిల్స్:
ఈమె 1923 జూన్ 18 న గుజరాత్ లో ఉన్న వాడ్నగర్ లోని మెహసానాలో జన్మించారు. హీరాబెన్ భర్త పేరు దామోదర ముళ్చంద్ మోడీ, ఈయన టీ అమ్మేవారు. ఈ దంపతులకు ఐదుగురు కొడుకులు, ఒక కూతరు ఉన్నారు. కుమారుల పేర్లు సోమా మోడీ, ప్రహ్లాద్ మోడీ, నరేంద్ర మోడీ, పంకజ్ మోడీ, అమ్రిత్ మోడీ. కూతురు వాసంతిబెన్ మోడీ. సోమా మోడీ హెల్త్ డిపార్ట్మెంట్ లో పని చేసి,ఇప్పుడు రిటైర్ అయ్యాడు. పంకజ్ మోడీ కూడా గుజరాత్ లోని ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ లో పని చేసి, ఇప్పుడు రిటైర్ అయ్యాడు. ప్రహ్లాద్ మోడీ ఒక షాప్ ఓనర్. అలాగే మోడీ 14వ ప్రైమ్ మినిస్టర్.
మోడీ తల్లి చనిపోవడంతో రాజకీయాల్లో ఉన్న ప్రముఖులందరూ సంతాపం తెలుపుతున్నారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి కోరుకుంటున్నారు. సినీ ప్రముఖులు కూడా సంతాపం తెలుపుతున్నారు. దేశానికి ఒక ఉత్తమైన నాయకుడి హీరాబెన్ అందించారని సినిమా వాళ్ళు ట్వీట్స్ వేస్తున్నారు.