కోవిడ్ వైరస్ ప్రభావంతో ఎదురయ్యే అనారోగ్య సమస్యలపై జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా మెరుగైన వైద్యం అందుతుందనే భరోసాను ప్రజల్లో కల్పించే విధంగా, అధికారులు చర్యలు చేపట్టాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
జిల్లాలో లాక్ డౌన్ నిర్వహణ, కోవిడ్ నివారణ చర్యలు, సానిటేషన్ నిర్వహణపై జిల్లా కలెక్టర్, వైద్య మరియు ప్రత్యేక అధికారులతో జూమ్ వెబ్ వీడియో ద్వారా సమీక్షించారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో మొదటివిడత ఫీవర్ సర్వే ద్వారా కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి సకాలంలో మందులను అందించి వారు హోం ఐసోలేషన్ పాటించేలా చేయడం ద్వారా, జిల్లాలో కోవిడ్ ప్రబావాన్ని అనుహ్యంగా తగ్గించుకోగలిగామని, ఫివర్ సర్వే సత్పలితాలను అందిస్తున్నందున రెండవ విడత ఇంటింటి సర్వే లో అధికారులతో పాటు ప్రజాప్రతినిధులను కూడా బాగస్వాములను చేసి పాజిటివ్ గా నిర్దారణ అయిన వారు ఆసుపత్రి వరకు రాకుండా ఇంటిలోనే తగు జాగ్రత్తలతో కరోనా చికిత్స పోంది కరోనా జయించేలా చేయాలన్నారు.

జిల్లాలో అవసరం మేరకు ఐసోలేషన్ సెంటర్లు, ఆక్సిజన్, రెమిడిసివిర్ ఆందుబాటులో ఉన్నాయని తెలియజేశారు. కోవిడ్ మరింత సమర్దవంతంగా ఎదుర్కోవాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రులకు కూడా కోవిడ్ చికిత్సను అందించడానికి 25 ప్రయివేటు 2 ప్రభుత్వ ఆసుపత్రులకు అనుమతులు ఇవ్వడంతో, జిల్లాలో 535 బెడ్లు అందుబాటులొకి వచ్చాయని, ప్రవేటు ఆసుపత్రులలో కోవిడ్ చికిత్సపేరుతో ప్రజలనుండి హద్దులు మీరి అధిక ఫీజులు వసూలుచేయడం వంటివి జరుగకుండా కఠినంగా వ్యవహరించి, తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి సూచించారు. కరోనా సమయంలో సిటీ స్క్యాన్ కూడా అవసరమవుతుందని, నిర్వహకులు అధిక ఫీజులను వసూలుచేయడం జరగకుండా, పేదలకు అందుబాటులోకి వచ్చేలా ప్రైవేటు ల్యాబు నిర్వహకులతో సమావేశం నిర్వహించి వారిని హెచ్చరించాలని అన్నారు.

పల్లె ప్రగతితో గ్రామాలలో సత్ఫలితాలు: మంత్రి కొప్పుల ఈశ్వర్ 

పాజిటివ్ గా నిర్దారణ అయిన వారికి ఇచ్చే మెడికల్ కిట్లో యాంటిబయోటిక్ ఉండేలా చూడడంతో పాటు, మెడిసిన్ చేక్ చేసుకోనేలా జాగ్రతలు వహించాలని అన్నారు.
రెండవ సారి లాక్ డౌన్ ఆమలు అయిన తరువాత కోవిడ్ పరిణామాలను, ఫలితాలను తెలుసుకోవాలని, ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలలో వసతి, మందులు, భోజనం, డాక్టర్ల అందిస్తున్న వైద్య సేవలపై అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. ఉదయం 10 తరువాత అవసరం లేని వారు రోడ్డుపైకి రాకుండా పోలీస్ వారు తగిన చర్యలు తీసుకోవాలని అన్నారు. కోవిడ్ పాజిటివ్ తో పాటు డెంగ్యూ ఫీవర్ కూడా వస్తున్న తరుణంలొ జిల్లా నుండి గ్రామస్థాయి వరకు పారిశుద్ద్యంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, గతంలో నిర్వహించుకున్న పల్లెప్రగతితో గ్రామాలలో సత్పలితాలు వచ్చాయని, పారిశుద్ద్యంపై అన్ని గ్రామాలలో అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించి ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చేయాలని అన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 25, 2021 at 2:40 సా.