ram-charan-mega-kodalu-get-full-anger-by-saying-do-you-want-to-date-with-ram-charan
ram-charan-mega-kodalu-get-full-anger-by-saying-do-you-want-to-date-with-ram-charan

Ram Charan: వాల్తేర్ వీరయ్య మూవీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి, సంచలన విజయాన్ని సాధించింది. సంక్రాంతికి విడుదలైన మూవీస్ అన్నింటిలో వీరయ్యే విన్నర్ గా నిలిచారు. వాల్తేర్ వీరయ్య సంక్రాంతికి విడుదల అయిన అన్ని మూవీస్ కంటే వీరయ్య మూవీ ఎక్కువ కలెక్షన్స్ వసూలు చేసింది. ఈ మూవీకి సాధించిన విజయాన్ని పురష్కరించుకొని, హన్మకొండలో సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఈ ఈవెంట్ కు చిరంజీవితో పాటు రామ్ చరణ్ స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. తండ్రి మూవీ సాధించిన విజయాన్ని చూసి, తానూ చాల సంతోషిస్తున్నాని, మళ్ళీ తమకు వింటేజ్ చిరంజీవిని చూపించిన దర్శకుడు బాబీకి కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఇప్పుడు ఈసభలో రామ్ చరణ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Ram Charan
Ram Charan

ఎవరా ప్రొడ్యూసర్స్ !!

ఈ ఈవెంట్ లో రామ్ చరణ్ మాట్లాడుతూ…”మైత్రి మేకర్స్ ప్రొడ్యూసర్స్ చాల మంచి ప్లానింగ్ తో మూవీస్ నిర్మిస్తారని, మూవీకి తగ్గట్టు ఖర్చు చేస్తారని, హీరోస్ ను చాల జాగ్రత్తగా చూసుకుంటారని, అనవసరపు ఖర్చుకు దూరంగా ఉంటారని, ఈ ప్రొడ్యూసర్స్ ను చూసి ఈ మధ్యే వచ్చిన ఇద్దరు ప్రొడ్యూసర్స్ చాల నేర్చుకోవాలని” అన్నారు. ఇప్పుడు వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ప్రొడ్యూసర్స్ ను ఉద్దేశించి రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు చేశారనే చర్చ జరుగుతుంది. అయితే రామ్ చరణ్ ఈ వ్యాఖ్యలు దిల్ రాజును ఉద్దేశించి అన్నాడని, ఎందుకంటే దిల్ రాజు ప్రొడక్షన్ లో శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ నటిస్తున్నారు. శంకర్ మూవీ కోసం దిల్రాజు ఇష్టమొచ్చినట్టు ఖర్చు చేస్తున్నాడనే ఉద్దేశంతోనే అన్నాడని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. అలాగే ఆచార్య ప్రొడ్యూసర్ ను కూడా అన్నాడని సోషల్ మీడియాల్లో చర్చించుకుంటున్నారు.

రోజాను టార్గెట్ చేశారా!!

ఈ ఈవెంట్ లో చరణ్ ఇంకా మాట్లాడుతూ…”చిరంజీవి గారు కొంచెం సౌమ్యంగా, వినయంగా ఉంటారని ఆయన అలా ఉంటేనే ఇంతమంది ఫ్యాన్స్ ఉన్నామని, ఒకవేళ అతను గట్టిగా మాట్లాడితే ఇంకెంతమంది ఉంటారో ఊహించుకోండని, అలాగే ఆయనకు ఎమన్నాఅంటే అయన ఊరుకుంటాడేమో కానీ తానూ, అయన ఫ్యాన్స్ మాత్రం ఖ్వైట్ గా ఉండమని ఖ్వైట్ గానే చెప్తున్నామని “అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలు మినిస్టర్ రోజాను ఉద్దేశించే ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది. కొన్ని రోజుల క్రితం మెగా ఫ్యామిలిపై రోజా చేసిన వ్యాఖ్యల గురించి మెగా అభిమానులు అప్పుడే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మళ్ళీ చరణ్ కుక్ ఆమెను ఉద్దేశించే ఆ వ్యాఖ్యలు చేశారని చర్చలు జరుగుతున్నాయి.