RGV: రామ్ గోపాల్ వర్మ ఎప్పుడు ఏ విషయాన్ని పట్టుకుంటాడో ఎవ్వరికి తెలియదు. మొన్నటి వరకు లోకేష్ పాదయాత్రపై, పవన్ కళ్యాణ్ -కేసీఆర్ మధ్య కుదిరిన ఒప్పందం గురించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనంపై ఇంటర్వూస్ ఇస్తూ వచ్చిన ఆర్జీవీ, ఇప్పుడు గత కొన్ని రోజులుగా మేయర్ గద్వాల్ విజయపై ఇంటర్వూస్ ఇస్తూ, ఆమెపై ట్వీట్స్ వేస్తూ ఉన్నారు. మేయర్ అజాగ్రత్త వల్లే కుక్కలదాడిలో ప్రదీప్ చనిపోయాడని, కుక్కల విషయంలో GHMC తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదని, దాని వల్లే ప్రదీప్ చనిపోయాడదని, పైగా ప్రదీప్ చనిపోయిన దానికి ప్రభుత్వ స్పందన కూడా సరిగ్గా లేదని, ప్రదీప్ మరణం గురించి మాట్లాడుతూ… మేయర్ నవ్వడాన్ని కూడా ఆర్జీవీ తప్పు పట్టారు. ఇప్పుడు ఏకంగా “కుక్కల మేయర్” అన్న సాంగ్ ను కూడా విడుదల చేశారు.

మేయర్ ను వదలడా ఇంకా!!

ఎందుకో తెలియదు కానీ ప్రదీప్ మరణంపై ఆర్జీవీ చాలా చలించిపోయారు. ప్రదీప్ మరణించిన తరువాత వాళ్ళ కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలవకపోవడంపై కూడా ఆర్జీవీ అసంతృప్తి వ్యక్తం చేశారు. సాధారణంగా ఇలాంటి విషయాలకు దూరంగా ఉండే ఆర్జీవీ ఇప్పుడు ప్రదీప్డ్ విషయంలో చాల సీరియస్ గా ఫైట్ చేస్తున్నాడు. ప్రదీప్ మరణం తరువాత కుక్కల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో పాయింట్ బై పాయింట్ చెప్పాలని కూడా ఆర్జీవీ డిమాండ్ చేశారు. కానీ ప్రభుత్వ నుండి కానీ, మేయర్ నుండి ఎలాంటి స్పందన రాలేదు. ఎందుకంటే వాళ్ళు కుక్కలా విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో వాళ్ళు అసలు ఆలోచించలేదు కాబట్టి ఎలాంటి స్పందన లేదు. ఇప్పుడు ఈ కుక్కలా మేయర్ పాటతోనైనా మేయర్ అర్జీవికి స్పందిస్తారో లేదో చూడాలి.

GHMC కి ఎందుకింత పొగరు!!

ప్రదీప్ విషయంలో కానీ, స్ట్రీట్ డాగ్స్ విషయంలో కానీ ఆర్జీవీ మాట్లాడిన, మాట్లాడుతున్న ప్రతి పాయింట్ కూడా చాల లాజికల్ అండ్ కరెక్ట్. కానీ ప్రభుత్వం కానీ మేయర్ కానీ ఎలాంటి సమాధానం ఇవ్వడం లేదు. ఆ ఘటన తరువాత కుక్కల దాడులు రాష్ట్రంలో ఎక్కువైయ్యాయి. కానీ అధికారులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ప్రజల నుండి పన్నులు కట్టించుకోవడంపై పెట్టిన శ్రద్ధతో కొంచెం కూడా ప్రజల రక్షణ కోసం కేటాయించడం లేదు. ఈ కుక్కల విషయంలో ప్రభుత్వం తీసుకున్న జాగ్రత్తలు గురించి కనీసం ఒక్క ప్రకటన కూడా ప్రభుత్వం విడుదలచెయ్యలేదు.