Roja Controversy : సూపర్ స్టార్ రజినీకాంత్ పై వైసీపీ నేతలు ఎంతలా విమర్శలు చేశారో అందరం చూశాం. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల కోసం ఆయన ఏపీకి వచ్చారు. చంద్రబాబును ఆయన పొగిడారు. ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు వచ్చి చంద్రబాబును ఎట్లా రజినీకాంత్ పొగుడుతారు అంటూ వైసీపీ నేతలు గగ్గోలు పెట్టారు. రజినీకాంత్ ను టార్గెట్ చేశారు. తీవ్రస్థాయిలో ఆయనపై విమర్శలు చేశారు. చంద్రబాబును ఎట్లా నమ్ముతావు అంటూ రజినీకాంత్ ను తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. అసలు.. ఎన్టీఆర్ కు చంద్రబాబు వెన్నుపోటు పొడిచే సమయంలో రజినీకాంత్ కూడా చంద్రబాబుకు మద్దతు ఇచ్చారని.. అటువంటి రజినీకాంత్ ఇప్పుడు ఎన్టీఆర్ గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉంది అంటూ వైసీపీ నేతలు తెగ రెచ్చిపోయారు. దీంతో ఏపీ రాజకీయాలు కాస్త సినిమా రంగును పూసుకున్నాయి.
కట్ చేస్తే.. ఇప్పుడు రోజా వ్యవహారం మరోసారి చర్చనీయాంశం అయింది. చంద్రబాబు అరెస్ట్ పై రోజా ఆయన ఫ్యామిలీపై చేసిన విమర్శలపై టీడీపీ నేతలు మండిపడ్డారు. టీడీపీ మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అయితే ఒక అడుగు ముందుకు వేసి రోజాపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రోజా నువ్వెంత.. నీ బతుకెంత.. నువ్వు ఆ చిత్రాలలో నటించావు. ఆ సీడీలు కూడా ఇంకా నా దగ్గర ఉన్నాయి.. అంటూ రచ్చ రచ్చ చేశారు. దీంతో చంద్రబాబు అరెస్ట్ టాపిక్ కాస్త రోజా వైపు మళ్లింది. ఒక మహిళా రాజకీయ నేతపై అలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు అంటూ బండారుపై వైసీపీ నేతలు మండిపడ్డారు. అంతే కాదు.. రోజాకు సినీ రంగం నుంచి కూడా మద్దతు లభిస్తోంది. ఒక మహిళను పట్టుకొని అలాంటి వ్యాఖ్యలు చేస్తారా అంటూ తెలుగు, తమిళం ఇండస్ట్రీ నుంచి కూడా సినీ ప్రముఖులు ఆమెకు మద్దతు ఇస్తున్నారు. వైసీపీ నేతలు కూడా బండారు వ్యాఖ్యలపై దుమ్మెత్తిపోస్తున్నారు.
Roja Controversy : ఆనాడు రజినీకాంత్‌కి ఎందుకు మద్దతు ఇవ్వలేదు?
రోజాకు మద్దతు ఇస్తున్నం అని ప్రకటిస్తున్న సినీ ప్రముఖులు ఆనాడు రజినీకాంత్ పై వైసీపీ నేతలు విమర్శలు చేసినప్పుడు ఎందుకు స్పందించలేదు. అప్పుడు ఎందుకు స్పందించలేదు. ఎందుకు ఆనాడు రజినీకాంత్ కు మద్దతు ఇవ్వలేదు. ఆయనకు ఒక లెక్క.. రోజాకు మరో లెక్కా. ఖుష్బూ, నవనీత్ కౌర్, రాధిక లాంటి వాళ్లు రోజాపై బండారు చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మరి.. ఆనాడు రజినీకాంత్ ను వైసీపీ నేతలు అన్నేసి మాటలు అన్నప్పుడు వీళ్లు ఎక్కడికి వెళ్లారు. ఎందుకు వీళ్లు స్పందించలేదు. రోజాను ట్రోల్ చేయడం తప్పే.. ఆమెపై అలాంటి వ్యాఖ్యలు చేయడం తప్పే.. మరి ఆనాడు రజినీకాంత్ ను ట్రోల్ చేయడం కరెక్టా.. ఆయనపై వైసీపీ నేతలు విరుచుకుపడటం కరెక్టా.. ఆ విషయంపై ఎందుకు సినీ ప్రముఖులు స్పందించలేదు అంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు. రజినీకాంత్ ఏ తప్పు చేయకపోయినా.. ఆయన ఏపీ వచ్చి ఎన్టీఆర్ శతజయంతి వేడుకల్లో పాల్గొన్నందుకు ఇలాంటి రచ్చ చేస్తారా? మీరు నిజంగా నిజాయితీతో ఉంటే ఎందుకు అప్పుడు స్పందించలేదు.. అంటూ ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.