Roja: తెలుగు సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదనే చెప్పాలి. ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నెంబర్ వన్ హీరోయిన్ గా హడావిడి చేసింది. తన అందంతో ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. చిరంజీవి, నాగార్జున, బాలయ్య వంటి స్టార్ హీరోల సరసన నటించి నటనలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
దాదాపు 200 పైగా సినిమాల్లో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేసుకుంది. పైగా బుల్లితెరపై పలు షో లలో జడ్జిగా వ్యవహరించిన మనకు తెలిసిందే.
ఇక సోషల్ మీడియాలో కూడా కాస్త అటు ఇటుగానే అనిపిస్తుంది. సినీ రంగంలోనే కాకుండా రాజకీయంగా కూడా మరో లెవెల్ లో దూసుకుపోతుంది రోజా. ఇటీవలే ఏపీలో మంత్రి పదవికి శ్రీకారం చుట్టింది.
దీంతో ప్రస్తుతం ఆమె జబర్దస్త్ షోకు దూరంగా ఉంటూ వైయస్సార్ పార్టీలో తన మంత్రి పదవిలో బిజీగా ఉంది. ఇక మంత్రి పదవి చేపట్టినప్పటి నుంచి ఆమె చేసిన వ్యాఖ్యలు బాగా హాట్ టాపిక్ గా మారాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆపోజిషన్ పార్టీ నాయకులను బాగా వ్యతిరేకిస్తూ విమర్శలు చేసింది.
అయితే ఇదంతా పక్కన పెడితే.. తాజాగా రోజా రాజకీయాలకు దూరం కానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకు అసలు విషయం ఏంటంటే.. రోజాకు తన సొంత నియోజకవర్గం నగరిలో ఎదురుదెబ్బ తగిలింది.. స్వయంగా తానే తమ పార్టీ కార్యకర్తలపై ఆరోపణలు చేసింది. తను లేకుండానే రైతు భరోసా కేంద్రానికి భూమి పూజ చేసిన వ్యతిరేకవర్గంపై ఫైర్ అయింది రోజా.
Roja: రోజా రాజకీయాలకు గుడ్ బై చెప్పనుందా..
తను లేకుండానే తనకు చెప్పకుండానే భూమి పూజ చేయటం పై బాగా ఆవేదన చెందింది. తన నియోజకవర్గంలో తనను బలహీస్తున్నారు అంటూ ఆందోళన చెందుతుంది. తెలుగుదేశం పార్టీ, జనసేన నవ్వుకునేలాగా తనకు నష్టం కలిగేలా వైసీపీ నేతలు చేస్తున్నారని బాగా ఆవేదన చెందింది రోజా. దీంతో ఇలా అయితే రాజకీయాలు చేయటం కష్టం అంటూ షాకింగ్ కామెంట్ చేసింది. ఇక ఆమె చేసిన వ్యాఖ్యలు వైరల్ అవ్వటంతో.. తను రాజకీయాలకు గుడ్ బై చెప్పనుందా అనే అనుమానాలు వస్తున్నాయి. మరి చివరికి రోజా ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.