జమ్మికుంట రూరల్ తెరాస పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు దిశానిర్దేశం చేసారు.
ఈ సందర్భంగా మంత్రి గారు మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని కోరి ఒక తీర్చిదిద్ది ఈ సంక్షేమ ఫలాలను మన తెలంగాణ ప్రజానీకానికి అందించాలని, అటువంటి ఒక సంకల్పంతో లక్ష్యంతో ఒక పట్టుదలతో వచ్చినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం, ఇది ఆషామాషీ ప్రభుత్వం కాదని,
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం మూడున్నర నెలల్లో 45 లక్షల ఎకరాలకు నీటిని అందించే ఉద్దేశంతో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, ఈ రోజు కోటి 20 లక్షల ఎకరాలకు నీళ్లు అందడం ఎలా సాధ్యం అయింది. ఒక సంకల్పం ఉంటే ఒక పట్టుదల ఉంటే ప్రజలకు మేలు చేయాలనే కోరిక ఉంటే అటువంటి నాయకత్వం ఉంటే పార్టీ అధికారంలో ఉంటే అటువంటి ప్రభుత్వం ఉంటే తప్పా సాధ్యం కాదని మంత్రి కొప్పుల అన్నారు.
అంతేకాక ఆరుసార్లు ఎమ్మెల్యే అవుతానని అనుకోలే కాని ఉద్యమ పుణ్యం కెసిఆర్ గారి నాయకత్వం యొక్క పుణ్యమే తో నేను మంత్రి అయినానని,
తెలంగాణ రాష్ట్ర సమితి లో ఎక్కువ గౌరవం పొందింది ఈటెల రాజేందర్ గారేనని, మతతత్వ పార్టీ అయిన బీజేపీని ఈ హుజురాబాద్ నియోజకవర్గ ప్రజలకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని,
ఆత్మగౌరవం గురించి మాట్లాడి రాజేందర్ గారు ఈ రోజు ఇదే ఆత్మ గౌరవాన్ని డిల్లీ లో తాకట్టు పెట్టింది నువ్వు కాదా అని అన్నారు.నాకు తెలిసి మీ ఆత్మ గౌరవం టిఆర్ఎస్ లో చాలా గొప్పగా ఉండే బిజెపిలో మాత్రం మీ ఆత్మ గౌరవం ఉంటుందో చూడాలని, స్వంత లాభం కోసం రాజకీయ భిక్ష పెట్టిన టీఆర్ఎస్ ను విమర్శించడం సరికాదని, బీజేపీ మీకు ఎంతటి ఆత్మగౌరవం కల్పిస్తుందో మీకు త్వరలో తెలుస్తుందని మంత్రి కొప్పుల ఈశ్వర్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.