Ys jagan: స్వామి స్వరూపానందేంద్ర సరస్వతికి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక నమ్మకమైన శిష్యుడిగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి తీసుకునే ప్రతి నిర్ణయాన్ని ముందు ఆయనతో డిస్కస్ చేసి మరీ తీసుకుంటారని వార్తలు ప్రచారంలో ఉన్నాయ్. అయితే ఇప్పుడు ఈ స్వామిజికి సడన్ గా మతం బాగోగులు గుర్తుకు వచ్చాయి. మతం మార్పిడి గురించి క్రిస్మస్ రోజు కీలక వ్యాఖ్యలు చేశారు. గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలను టార్గెట్ చేసుకొని, మత మార్పిడిలు జరుగుతున్నాయని, అలాంటివి జరగకుండా ఆపాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్వామి సరస్వతి చెప్పారు. అయితే ఈ వ్యాఖ్యలు జగన్ ను ఉద్దేశించే చేశారని, జగన్ క్రిస్టియన్ మతానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారనే వార్తలు ప్రచారంలో ఉన్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలకు ప్రాధాన్యత సంతరించుకుంది.

మత మార్పిడులకు అడ్డుకట్ట
రాష్ట్రంలో మత మార్పిడి విపరీతంగా పెరిగిందని, దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. గిరిజన ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని మత మార్పిళ్లు యథేచ్ఛగా ప్రయత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. అటువంటి దుర్మార్గమైన మతం..అంటూ ఆయన మండిపడ్డారు. ఎవరూ కూడా మతం మారకూడదని.. మన మతంలో మనం ఉండాల్సిన అవసరం ఉందని స్వామి స్వరూపానందేంద్ర స్పష్టం చేశారు. మన మతంలో మనం ఉండాలనే పిలుపును ఇవ్వడానికి డిసెంబర్ 25వ తేదీ నాడు కొన్ని కీలక నిర్ణయాలను తీసుకున్నామని ఆన చెప్పారు. వాటిని తక్షణమే అమలులోకి తీసుకొచ్చామని వివరించారు. గిరిజన ప్రాంతాలను అన్యమతాలు టార్గెట్ చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు. మత మార్పిళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని తేల్చి చెప్పారు.
మత మార్పిడికి కారణాలేంటి!!
మతమార్పిడి జరుగుతుందని ఇప్పుడు ఈ స్వామీజీలు బాధపడుతున్నారు కానీ అసలు మతమార్పిడికి తాము ఆచరించిన నీచ ఆచారాల వల్లే నని తెలుసుకోలేకపోతున్నారు. వాళ్ళను మతానికి దూరం చేసింది, వాళ్ళను గుళ్ళోకి అడుగుపెట్టకుండా చేసింది, వాళ్ళను అంటరాని వాళ్ళుగా చూసింది, వాళ్ళు ముట్టుకుంటే దేవుడు మైల పడుతాడనే నీచ సంస్కృతి పాటించి, పాటించి ఇప్పుడు మతం మారుతున్నారని అరుస్తున్నారు. మొదట నుండి ఈ బుద్ది ఉండి, వాళ్ళను మనుషులుగా చూసి ఉంటె ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. అయినా ఎప్పుడో పాతకాలంలో పెట్టుకున్న ఈ మతం అనే ఆచారాన్ని ఇప్పటికి పాటించడం అనాగరికం. మనిషికి ఇప్పుడు చట్టం ఉంది, అది మనిషిని కంట్రోల్ చెయ్యగలడు. ఇంకా మనిషిని కంట్రోల్ చెయ్యడానికి మతం అవసరం లేదు. ఈ మతాల పిచ్చి నుండి ప్రజలు బయటపడి, మనుషులుగా బతికితే బాగుంటుంది .