TDP: మహానాడు టీడీపీ కూడా ఊహించన్నంత సక్సెస్ అయ్యింది. మహానాడు ఇచ్చిన ఉత్సహంతో టీడీపీ నాయకులు మరింత ఉత్సహంతో పని చేసేందుకు సిద్ధమయ్యారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీని ఓడించాలని టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. అలాగే వైసీపీని ఓడించడానికి కొత్త వ్యూహాలను టీడీపీ రచిస్తుంది. అయితే ఇప్పుడు మరో వ్యూహంతో వైసీపీకి టీపీడీ చెక్ పెట్టనుంది. టీడీపీ హయాంలో టీడీపీకి మంచి పేరు తెచ్చిన అన్నా క్యాంటీన్ మళ్ళీ ప్రారంభిచడానికి టీడీపీ నాయకులు సిద్ధమయ్యారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఐదు రూపాయలు ఉన్న అన్నా క్యాంటిన్ భోజనాన్ని 4 రూపాయలకే ఇస్తామని చెప్పి, తరువాత మాట తప్పారు.

అయితే ఇప్పుడు వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటిన్ ను తీసేశారు, అలాగే వైఎస్ఆర్ క్యాంటీన్లను పెడతామని చెప్పి వాటిని కూడాపెట్టలేదు . దింతో పేద ప్రజలను ఆకలికి గురి చేసిన, చేస్తున్న పాపం వైసీపీకి అంటుకుంది. ఇప్పుడు ఈ విషయాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడానికి టీడీపీ మళ్ళీ తమ సొంత డబ్బుతో అన్నా క్యాంటిన్ లను ప్రారంభించనుంది. కొన్ని సెలెక్టెడ్ ప్రాంతాల్లో అన్నా క్యాంటీన్స్ ప్రారంభం కానున్నాయి. ఎన్నారైల సహకారంతో గుంటూరులో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను బాలకృష్ణ ప్రారంభించారు. హిందూపురంలోనూ ఆయన సతీమణి మరొకటి ప్రారంభిచారు.
అలాగే ఇతర ప్రాంతాల్లోనూ రానున్న రోజుల్లో టీడీపీ అన్నా క్యాంటిన్ లను ప్రారంభించనుంది. ఇప్పటికే నిమ్మల రామానాయుడు, చింతమనేని ప్రభాకర్ వంటి నేతలు సొంత ఖర్చుతో అన్న క్యాంటీన్లు నడుపుతున్నారు. ఈ వ్యూహాత్మక ప్రణాళికలతో వైసీపీకి రానున్న రోజుల్లో ఓటమి రుచిని చూపించనుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు.