Nara Lokesh – Yuvagalam : టీడీపీ పార్టీకి చంద్రబాబు ఒక కన్ను అయితే.. యువ నేత నారా లోకేశ్ మరో కన్ను. అవును.. టీడీపీ పార్టీని ఇప్పుడు చంద్రబాబు, నారా లోకేశ్ ఇద్దరూ తమ భుజాల మీద నడిపిస్తున్నారు. పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఏడు పదుల వయసు దాటినా అనారోగ్య సమస్యలు వేధిస్తున్నా ఇప్పటికీ ప్రజలతో మమేకం అవుతూ.. నిరంతరం ప్రజలు గురించే ఆలోచిస్తున్నారు చంద్రబాబునాయుడు. ఆయన టీడీపీ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే కాదు.. ప్రజలకు ఏవిధంగా ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలి. టీడీపీ పార్టీ ద్వారా ప్రజలకు ఎలాంటి సాయం చేయాలి అని నిరంతరం ఆలోచిస్తుంటారు.
మరోవైపు యువనేత నారా లోకేశ్.. ఈ వయసులో పాదయాత్ర చేస్తూ అందరినీ ఆశ్యర్యానికి గురి చేస్తున్నారు. ఏపీ మొత్తం వేసవిలో పాదయాత్ర చేస్తూ అందరినీ షాక్ కు గురి చేస్తున్నారు. ఎండాకాలంలో పాదయాత్ర చేయడం అంత ఈజీ కాదు. ఎర్రటి ఎండలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా నిరంతరం శ్రమిస్తూ పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్తూ.. ప్రజల కష్టాలను దగ్గరుండి తెలుసుకుంటున్నారు నారా లోకేశ్. యువగళం పేరుతో ఆయన గత కొన్ని రోజుల నుంచి ఎండను సైతం లెక్కచేయకుండా, తన ఆరోగ్యాన్ని పణంగా పెట్టి నడుస్తూ ప్రజల కష్టాలను దగ్గరుండి చూసి మీకు నేనున్నాను అనే భరోసా ఇస్తున్నారు నారా లోకేశ్.
Nara Lokesh – Yuvagalam : నారా లోకేశ్ కు బ్రహ్మరథం పడుతున్న ప్రజలు
పాదయాత్ర అంటే ఏదో వందల మంది పాల్గొంటారు. కానీ.. నారా లోకేశ్ పాదయాత్ర చూస్తే షాక్ అవుతారు. ఎందుకంటే వందలు కాదు.. వేలు, లక్షల మంది నారా లోకేశ్ వెంట పాదయాత్రలో కదులుతున్నారు. యువగళం పాద్రయాత్రకు వస్తున్న స్పందన చూసి ఇతర పార్టీలకు వణుకు పుడుతోంది. ఏపీ అంతటా దాదాపు సంవత్సరం పాటు నారా లోకేశ్ ఈ పాదయాత్రను చేపట్టనున్నారు. గత జనవరిలో ప్రారంభమైన ఈ యువగళం ఇప్పటికీ నిరంతరం విజయవంతంగా కొనసాగుతోంది. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా జనాలు.. పాదయాత్రలో నారా లోకేశ్ కు మద్దతు ఇవ్వడానికి యూత్ కదిలివస్తోంది. తమ సమస్యలను లోకేశ్ కు చెప్పుకుంటోంది. మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు అందరూ నారా లోకేశ్ పాదయాత్రకు కదిలివస్తున్నారు.