TDP: సిఎం జగన్మోహన్ రెడ్డి జిల్లా అయిన కడపలో తన జెండా కూడా ఎగరవేయడానికి టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. కడపలో ఉన్న సీనియర్ నేతలను పార్టీలోకి తీసుకోవడానికి వ్యూహాలు రచిస్తున్నారు . అందులో భాగంగానే ఇప్పుడు డీఎల్ రవీంద్ర రెడ్డి, వీరాశివారెడ్డి టిడిపిలోకి వస్తున్నారని సోషల్ మీడియా వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఆదిశగానే ఈ నేతలు అడుగులు వేస్తున్నారు. వాళ్ళను పార్టీలోకి తీసుకోవడానికి కూడా చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారు. అయితే ఇప్పుడు టిడిపి జనసేన టిడిపితో పొత్తు పెట్టుకోవడం వల్ల ప్రతి నియోజక వర్గంలోని నేతలు సీట్ల కోసం పోటీ పడుతున్నారు. అందుకే ఇప్పుడు కడపలో కూడా టిడిపి నేతలు వచ్చే ఎన్నికల్లో సీట్ కోసం ఇప్పటి నుండే వ్యూహాలు రచిస్తున్నారు. అయితే ఈ నేతలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపరన్న ఉద్దేశంతో వైసీపీ వీళ్ళను పట్టించుకోవడం లేదు.

డీఎల్-వీరశివారెడ్డి
డీఎల్ రవీంద్రారెడ్డి జిల్లాలో సీనియర్ నేతగా ఉన్నారు. ఆరు సార్లు మైదుకూరు నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రిగానూ పని చేసారు. మైదుకూరులో టీడీపీ నేత పుట్టా సుధాకర్ యాదవ్ రేసులో ఉన్నారు. ఈ సారి ఆయన తనయుడు కూడా టికెట్ ఆశిస్తున్నారు. ఇద్దరిలో ఒకరికి టికెట్ దక్కే అవకాశం కనిపిస్తోంది. మైదుకూరులో పుట్టా సుధాకర్ యాదవ్ కు టికెట్ ఇవ్వాలని నిర్ణయిస్తే.. కడప ఎంపీగా డీఎల్ రవీంద్రా రెడ్డి పోటీ చేసే అవకాశం ఉంది. అయితే, ఎంపీగా పోటీకి డీఎల్ సుముఖంగా లేరని చెబుతున్నారు. అదే విధంగా వీర శివారెడ్డి గతంలోనూ టీడీపీ నుంచి రెండు సార్లు..కాంగ్రెస్ నుంచి ఒకసారి ఎమ్మెల్యేగా కమలాపురం నుంచి గెలుపొందారు. ప్రస్తుతం కమలాపురం లో సీఎం జగన్ మేనమామ రవీంద్రనాధ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. వచ్చే ఎన్నికల్ల వీర శివారెడ్డి కమలాపురం నుంచి టీడీపీ టికెట్ పైన హామీ వచ్చాకే పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారని సమాచారం.
వైసీపీ పట్టించుకోవడం లేదా!!
ఈ ఇద్దరు నేతల్లో డీఎల్ రవీంద్రారెడ్డి 2019 ఎన్నికల్లో వైసీపీలో చేరారు. కానీ ఇప్పుడు వైసీపీపైనే ఎలా పడితే అలా వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ వైసీపి వాళ్ళు మాత్రం ఆయన వ్యాఖ్యలను పట్టించుకోవడం లేధు. ఆయన అసలు పార్టీలనే ఉన్నట్టు తాము పట్టించుకోవడం లేదని, అందుకే ఆయన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదని వైసీపీ నేత సజ్జల అన్నారు. ఈ ఇద్దరు నేతలకు ప్రజల్లో అంతా ఆధారనేమి లేధు. కానీ టిడిపి ఎంతోకొంత ఉపయోగపడే అవకాశం ఉంది. టిడిపితో పొత్తు ఉండటం వల్లే ఇప్పుడు టిడిపిలోని నేతలకు సీట్లపై ఖంగారు మొదలైంది.