TDP : తెలుగుదేశం పార్టీ అనేది ఒక పేరు మాత్రమే కాదు. అది ఒక పార్టీ మాత్రమే కాదు. తెలుగు వారి ఆత్మగౌరవం. తెలుగు వారి గుండె చప్పుడు. తెలుగు వారు అంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ కాదు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండూ కలిపితే వచ్చే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం, తెలుగు ప్రజల బాగు కోసం పుట్టిన పార్టీ ఇది. రాజకీయాలు చేయడం కోసం పార్టీలు పుడతాయి కానీ.. టీడీపీ మాత్రం తెలుగు ప్రజల కోసం పుట్టిన పార్టీ. అందుకే పార్టీ పెట్టి 40 ఏళ్లు అయినా కూడా ఇప్పటికీ పార్టీకి ప్రజల్లో ఉన్న ఆదరణ అనంతం.
ఉమ్మడి ఏపీలో అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. ఇది ఎవ్వరూ కాదనలేని సత్యం. తెలుగు భాష పరిరక్షణ కోసం, తెలుగు ప్రజల కోసం పేదలకు కూడు, గూడు, గుడ్డ ఉండాలనే నినాదంతో వచ్చిన పార్టీ తెలుగు జాతి అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేసింది. ఒకప్పుడు హైదరాబాద్ ఎక్కడ ఉండేది. ఇప్పుడు ఎక్కడ ఉంది. 30 ఏళ్ల కిందనే హైదరాబాద్ కు ఐటీ ఇండస్ట్రీని తీసుకొచ్చి హైదరాబాద్ ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత టీడీపీకే దక్కుతుంది. అది టీడీపీ అధినేత చంద్రబాబుకే దక్కుతుంది.
TDP : ఉమ్మడి ఏపీ అభివృద్ధిలో టీడీపీది కీలక పాత్ర
ఉమ్మడి ఏపీలో టీడీపీ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సమయంలో ఏపీ అభివృద్ధి కోసం ఎంతో పాటుపడింది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఏపీకి ఎన్నో పెట్టుబడులను తీసుకొచ్చారు. ఏపీకి ఎన్నో పరిశ్రమలు తరలివచ్చాయి. ఐటీ ఇండస్ట్రీని హైదరాబాద్ కు తీసుకొచ్చి తెలుగు ప్రజల ఖ్యాతిని దశదిశలా వ్యాప్తి చేశారు చంద్రబాబు.
అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని ఉచిత వైద్యం, హెల్త్ కార్డ్, ఆవాళ్లకు సమాన హక్కు, కూడు, గూడు, గుడ్డ, ప్రజల కోసం, పేదల కోసం ఇలా చాలా సంక్షేమ పథకాలను చంద్రబాబు హయాంలో ప్రారంభించారు. 1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ ముఖచిత్రమే మారిపోయింది. ప్రపంచమంతా ఏపీ వైపు చూసింది. ఆయన తీసుకొచ్చిన పలు విధానాలు, విప్లవాత్మక మార్పులు ఏపీ అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గా మారాయి.