TDP:జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత మూడు రోజులుగా ఢిల్లీ పర్యటనలో ఉన్న విషయం మనకు తెలిసిందే. ఇలా ఢిల్లీ వెళ్ళగానే అసలు ఈయన ఢిల్లీ పర్యటన వెనుక గల కారణమేంటి అని పెద్ద ఎత్తున వైసిపి నాయకులు చర్చలు జరుపుతున్నారు.ఢిల్లీ వెళ్లినటువంటి ఈయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అలాగే ప్రధాని నరేంద్ర మోడీలతో కలిసే అవకాశాలు ఉన్నాయని భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల వారి అపాయింట్మెంట్ కుదరకపోవడంతో బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మురళీధరన్ మరి కొంతమంది కేంద్ర మంత్రులను కలిశారు.
పవన్ వెంట జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఇక ఢిల్లీ వెళ్లిన ఈయన వచ్చే ఎన్నికలలో పోటీ చేసే విషయంలో బిజెపితో కలిసి పలు అంశాల గురించి చర్చించడం కోసమే వెళ్లారని నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. గత ఎన్నికలలో మాదిరిగా ఓట్లు చీలిపోకుండా ఉండడం కోసం వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన బీజేపీ కలిసి పోరాడితే అధికారంలోకి రావచ్చు అన్న విషయం గురించి బిజెపి నాయకులతో మాట్లాడటం కోసమే ఈయన ఢిల్లీ వెళ్లారని తెలుస్తుంది.
TDP: వైసిపిని గద్దె దింపడం ఖాయం…
ఇక తన అభిప్రాయాన్ని బీజేపీ నేతల పెద్దల ముందు పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ వారి నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్లు మనోహర్ వెల్లడించారు. అయితే ఈ విషయంపై పలువురు స్పందిస్తూ జనసేనతో బిజెపి పొత్తుకు సిద్ధమైనప్పటికీ తెలుగుదేశం పార్టీని కలుపుకొని ఎన్నికల బరిలో దిగడం గురించి బిజెపి అగ్రనేతల నిర్ణయమే కీలకమనీ తెలుస్తుంది.ఇక బిజెపి తన పార్టీతో పొత్తు పెట్టుకున్న పెట్టుకోకపోయినా తను మాత్రం తెలుగుదేశం పార్టీని వీడేదే లేదు అంటూ పవన్ తేల్చి చెబుతున్నారు. ఇక వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలన్న ఆలోచనలోనే తెలుగుదేశం ప్రభుత్వం జనసేనతో కలిసి పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తోంది. మరి వచ్చే ఎన్నికలలో పోటీకి దిగడం కోసం టిడిపి జనసేన ఏ విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.