YCP, TDP: వచ్చే ఎన్నికల్లో గెలిచి మళ్ళీ అధికారం చేపట్టాలని వైసీపీ, ఈసారి ఎలాగైనా గెలిచి, లోకేష్ ను సీఎం చెయ్యాలని చంద్రబాబు నాయుడు విపరీతంగా వ్యూహాలు రచిస్తున్నారు. రాష్ట్రంలో ఇంకా బీజేపీ,జనసేన పార్టీలు ఉన్నాయి కానీ ప్రధాన పోటీ మాత్రం టీడీపీ, వైసీపీ మధ్యనే ఉండబోతుంది. అయితే ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఒకరిపై ఒకరు ఎత్తులు వేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు ఈ ఇద్దరు నేతలు ఒక ప్రాంతంపై ఫోకస్ చేస్తున్నారు. ఆ ప్రాంతమే రాయలసీమ. ఇక్కడ మొత్తం 52 నియోజక వర్గాలు ఉన్నాయ్. ఇక్కడ టీడీపీ కేవలం 3 స్థానాల్లో మాత్రమే గెలిచింది. మిగితా స్థానాల్లో వైసీపీనే విజయం సాధించింది. జగన్, చంద్రబాబు నాయుడు ఇద్దరూ ఈ ప్రాంతంలో వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు ఎలా గెలవాలని వ్యూహాలు రచిస్తున్నారు. రాయలసీమ ఏరియాలో వైసీపీకి చాలాబలం ఉంది. అక్కడ వైసీపీని ఓడించడం అంత సులువు కాదు. కానీ టీడీపీ ఇప్పుడు దాన్నే ఛాలెంజ్ గా తీసుకోని, అక్కడే ఎక్కువ స్థానాల్లో గెలవడానికి వ్యూహాలు రచిస్తున్నారు.

టీడీపీ వైసీపీని ఎదుర్కొనగలడా!!
రాయలసీమ అంటే వైసీపీ అడ్డా. అక్కడ వైసీపీని ఓడించడం అంత సులువు కాదు. 52 నియోజకవర్గాల్లో 49 నియోజకవర్గాల్లో వైసీపీని గెలిచింది. టీడీపీ కేవలం కుప్పం, హిందూపురం, ఉరవకొండ నియోజకవర్గాల్లో మాత్రమే గెలిచింది. కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడుకు వైసీపీ చుక్కలు చూపించింది. వైసీపీ ఇంత బలంగా ఉన్న ప్రాంతాల్లో టీడీపీ వ్యూహాలు రచించడం శుద్ధ వేస్ట్ అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. అయితే మొన్న కుప్పంలో చంద్రబాబు నాయుడు పెట్టిన సభకు జనాలు విపరీతంగా వచ్చారు. అలాగే రాయలసీమలో చేసిన పర్యటనలకు విపరీతమైన స్పందన వచ్చింది. నిజం చెప్పాలంటే ఉత్తరాంధ్ర, కోస్తా అంటే కూడా ఇక్కడే పార్టీకి చాలా ఆదరణ లభిస్తుంది. ఈ ఆదరణను టీడీపీ వచ్చే ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకుంటుందో వేచి చూడాలి.
వైసీపీ బలహీనపడిందా!!
రాయలసీమలోకి వేరే పార్టీ వెళ్లాలనుకోవడం అమాయకత్వం. ఎందుకంటే అక్కడ వైసీపీకి 49 స్థానాల్లో ప్రజలు విజయాన్నిఆ అందించారు. ఇంతా బలమైన ప్రాంతంలో ఇప్పుడు వైసీపీ బలహీనపడిందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో వైసీపీలో నాయకుల మధ్యనే విభేదాలు ఉండటం వల్ల, వాళ్లలో వాళ్ళే ఆధిపత్యం కోసం కొట్టుకుంటున్నారు. వైసీపీ బలహీనపడిన ప్రాంతాల్లో తన బలం పెంచుకోవడానికి టీడీపీ ప్రయత్నాలు చేస్తుంది. అందుకే టీడీపీ వచ్చే ఎన్నికల్లో కేవలం గెలుస్తారన్న వాళ్ళకే సీట్ ఇవ్వడానికి వ్యూహం రచిస్తున్నారు. గెలవరనుకున్న నాయకులు ఎంత సీనియర్స్ అయినా కూడా సీట్ ఇచ్చేది లేదన్నట్టు చంద్రబాబు నాయుడు వ్యూహాలు రచిస్తున్నారు. రాయలసీమలో పట్టు సాధించిన పార్టీకే వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కే అవకాశం ఉంది.