Vangaveeti Ranga: వంగవీటి రంగా చుట్టూ మళ్ళీ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఇదంతా అయన మీద ఉన్న ప్రేమతో మాత్రం ఖచ్చితంగా కాదు, కేవలం ఓట్ల కోసం టీడీపీ, వైసీపీ నాయకులు చేస్తున్న చీప్ రాజకీయాలు ఇవి. వంగవీటి రంగా చనిపోయిన సందర్భంలో అధికారంలో ఉన్న పార్టీ టీడీపీ, ఆ పార్టీ ఆయనను చంపిందన్నఆరోపణలు అప్పటి నుండి ప్రచారంలో ఉన్నాయ్. అయితే ఇప్పుడు అదే పార్టీ నాయకులు గుడివాడలో రంగా వర్ధంతి వేడుకలు చెయ్యడానికి సిద్ధమయ్యారు. ఈ విషయం నచ్చని వైసీపీ నాయకులు ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి నిన్న రాత్రి ప్రయత్నించారు. దింతో రెండు పార్టీల నేతల మధ్య గొడవలు మొదలు అయ్యాయి. ఒకరిపై ఒకరు రాళ్లు కూడా విసురుకునేంత వరకు ఈ గొడవలు వెళ్లాయి. ఈ గొడవలకు కొడాలి నాని కారణమని టీడీపీ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
కొడాలి నాని కారణమా!!
గుడివాడలో రంగా వర్ధంతి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కొడాలి నాని అనుచరులే ప్రయత్నించారని టీడీపీ నాయకుడు మాజీ శాసన సభ్యుడు రావి వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. కోడలి నాని అనుచరుడు కాశీ తనకు కాల్ చేసి తనను, తన అనుచరులను కూడా చంపుతామని బెదిరించారని రావి వెంకటేశ్వర రావు తెలిపారు. అలాగే టీపీడీ నాయకులు రంగా వర్ధంతి కోసం ఏర్పాటు చేసిన స్థలం దగ్గరకు వచ్చి వైసీపీ అంతరాయం కలిగించడంతోనే ఇరువర్గాల మధ్య గొడవలు జరిగాయని టీడీపీ వాళ్ళు చెప్తున్నారు. రంగాను చంపిన వాళ్లకు రంగా పేరును కూడా పలికే అర్హత లేదని, అందుకే ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నామని వైసీపీ నాయకులు చెప్తున్నారు. గొడవ జరగడంతో పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి, గొడవలను సద్దుమణిగేలా చేశారు. అయితే ఈ విషయంపై ఇప్పుడు లోకేష్ స్పందించిన తీరుపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.
లోకేష్ రెచ్చగొడుతున్నాడా!!
రంగా వర్ధంతి కార్యక్రమాన్ని ఉపయోగించుకొని రాజకీయాలు చెయ్యడానికి టీడీపీ నాయకుడు లోకేష్ ప్రయత్నిస్తున్నారు. గుడివాడలో జరిగిన గొడవలను ఉద్దేశించి, నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు. గడ్డం గ్యాంగ్ కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ఆ గ్యాంగ్ కు గుండు కొట్టించే రోజు అతి దగ్గరలోనే ఉందని అన్నారు. ఈ గొడవకు సంబంధించిన ఓ వీడియో క్లిప్ ను నారా లోకేష్ తన అధికారిక మైక్రోబ్లాగింగ్ ప్లాట్ ఫామ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. తమ వద్ద అంతకంటే పెద్ద రాళ్లే ఉన్నాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని అన్నారు. అయితే ఈ గొడవను ఇంకా పెద్దది రాజకీయంగా లబ్ది పొందటానికి లోకేష్ ప్రయత్నిస్తున్నారని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. అయినా గొడవలను పెంచి, కార్యకర్తల ప్రాణాలను పణంగా పెట్టి ఇలా రాజకీయాలు చెయ్యడం ఏంటని సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.