CBN: ఏపీలో వైసీపీ, టీపీడీ రెండు నిత్యం గొడవపడుతూనే ఉంటాయి. ఒకరిపై ఒకరు ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటూ ప్రజలకు ఎంటర్టైన్మెంట్ ఇస్తూ ఉంటారు . ఈ పార్టీలకు ప్రజల అభివృద్ధి తప్పా మిగితా అన్నింటి గురించి మాట్లాడుతూ ఉంటారు. ఇద్దరి పార్టీలకు ప్రజల అభివృద్ధి కంటే కూడా అధికారం ముఖ్యం. దాని కోసం ప్రజలను ఇష్టమొచ్చినట్టు ఆడిస్తున్నారు. ప్రజల ముందు ఈ రెండు పార్టీల నేతలు గొడవపడుతున్నట్టు నటిస్తున్నారు కానీ ఈ రెండు పార్టీలు ఇప్పుడు ఒకే వేదికపైకి వచ్చాయి. ఈ రెండు పార్టీలను ఇప్పుడు బీజేపీ పార్టీ కలిపింది. రాష్ట్రపతి ఎన్నికల కోసం ఈ రెండు ఇప్పుడు బీజేపీ చెంతకు చేరుకున్నారు. బీజేపీ పార్టీ రాష్ట్రానికీ చేసిన మోసం గురించి తెలిసి కూడా ఇప్పుడు ఈ రెండు పార్టీలు బీజేపీ కాళ్ళు మొక్కుతూ తిరుగుతున్నారు. ఈ పార్టిలకు నిజంగా ప్రజల పట్ల బాధ్యత ఉంటె బీజేపీకి సపోర్ట్ చేసే వాళ్ళు కాదు. కేవలం అధికారం ఉంటె చాలనుకునే నాయకులకు రానున్న రోజుల్లో ప్రజలు ఎలా బుద్ది చెప్తారో చూడాలి.
టీడీపీ మద్దతు కూడా బీజేపీకే!!
గిరిజన మహిళకు మద్దతు ప్రకటించడం అదృష్టమని టీడీపీ నాయకులు ప్రకటించారు. సామాజిక న్యాయానికి టీడీపీ కట్టుబడి ఉందని చంద్రబాబు తెలిపారు. ఎన్డీఏ అభ్యర్థికి మద్దతు తెలిపినందుకు ధన్యవాదాలు అంటూ సోము వీర్రాజు మాట్లాడారు. వైసీపీ ఏర్పాటు చేసినమద్దతు సమావేశం కన్నా ఎక్కువ మంది దృష్టి తెలుగుదేశం పెట్టిన సమావేశంపైనే ఉంది. చివరి క్షణంలో మద్దతు ప్రకటించడం టీడీపీ సమావేశానికి రావడం వైసీపీ వర్గాలను కూడా ఆశ్చర్య పరిచింది. మొదట బీజేపీకి మద్దతు ఇవ్వరని అంతా అనుకున్నారు కానీ చివరకి టీడీపీకి కూడా బీజేపీ కాళ్ళ దగ్గరకు వెళ్ళింది.
టీడీపీ, వైసీపీకి సిగ్గుందా!!
గత ఎన్నికల సమయంలో ఈ రెండు టీడీపీ, వైసీపీ నేతలు మాట్లాడుతూ… బీజేపీ తలవంచి రాష్ట్రానికి ప్రత్యేకహోదా తెస్తామని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే బీజేపీని రాష్ట్రానికి రానివ్వమని చెప్పినం నేతలు ఇప్పుడు బీజేపీ చుట్టూ కాళ్ళు పట్టుకోవడానికి తిరుగుతున్నారు. పైకి మాత్రం బీజేపీని తిడుతున్నట్టు నటిస్తున్న ఈ నేతలు ఇప్పుడు తమ కపటబుద్ధిని బయటపెట్టుకున్నారు. కేవలం అధికారం కోసం మాత్రమే ఆరాటపడే నాయకుల బుద్ది ఇప్పుడు బయటపడింది. ఇలాంటి నేతలను ఏపీ ప్రజలు వచ్చే ఎన్నికల్లో తరిమికొట్టాలి. బీజేపీ మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని చెప్పినాన్ జగన్ ముందుగానే వెళ్లి బీజేపీ పెద్దల కాళ్ళ దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ద్రౌపతి ముర్ము పేరు చెప్పుకొని బీజేపీ కాళ్ళ దగ్గరకు వెళ్లారు. అంటే ఏపీకి ఎప్పటికి ప్రత్యేక హోదా రాదని స్పష్టమైతుంది.