tspsc-recruitment-2022-released-notification-for-assistant-motor-vehicle-inspector
tspsc-recruitment-2022-released-notification-for-assistant-motor-vehicle-inspector

Telangana: తెలంగాణ ప్రభుత్వం ఈమధ్య ప్రతి నెలకో నోటిఫికేషన్ ఇస్తూ వస్తుంది. ఇప్పటికే కానిస్టేబుల్, ఎస్సై, గ్రూప్ 1, 2, 3, 4 పోస్టులకు నోటిఫికెషన్స్ ఇచ్చింది. అలాగే మిగితా వాటిలో కూడా నోటిఫికేషన్ ఇస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు మరో 2391 పోస్టులకు నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఈ ఖాళీ పోస్టులను టీఎస్ పీఎస్సీ, మెడికల్ హెల్త్ బోర్డు, మహాత్మా జ్యోతిబాపూలే గురుకుల విద్యా సంస్థ భర్తీ చేయనుంది.

Telangana
Telangana

పోస్టుల వివరాలు:

గురుకుల పోస్టులు:

బీసీ గురుకులాల్లో మొత్తం 1499 పోస్టులను భర్తీ చేయనున్నారు. ప్రిన్సిపల్ పోస్టులు 10, డిగ్రీ లెక్చరర్స్ 480, జూనియర్ లెక్చరర్స్ 185, పీజీటీ 235, టీజీటీ 324, లైబ్రేరియన్ 11, లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజీ 37, లైబ్రేరియన్ ఇన్ స్కూల్ 11, ఫీజికల్ డైరెక్టర్ ఇన్ డిగ్రీ కాలేజీ 20, ఫీజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఇన్ స్కూల్ 33, ఆర్ట్/క్రాఫ్ట్/మ్యూజిక్ 33, అసిస్టెంట్ లైబ్రేరియన్ ఇన్ డిగ్రీ కాలేజీ 15, ల్యాబ్ అసిస్టెంట్ 60, కంప్యూటర్ ల్యాబ్ అసిస్టెంట్ 30, స్టోర్ కీపర్ 15 పోస్టులను భర్తీ చేయనున్నారు.

స‌మాచార పౌర సంబంధాల శాఖ‌:

స‌మాచార పౌర సంబంధాల శాఖ‌లో అసిస్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇంజనీరింగ్ 41, అసిస్టెంట్ పబ్లిక్ రేలషన్ ఆఫీసర్ 16, ఎడిటర్ 1, ఇన్ఫర్మేషన్ టెక్నీషియన్ 22, పబ్లిక్ రేలషన్ ఆఫీసర్ 04, పబ్లిసిటీ అసిస్టెంట్ 82 పోస్టుల భ‌ర్తీకి కూడా ఆర్థిక శాఖ అనుమతిచ్చింది. తొందర్లో ఈ పోస్టులకు అప్లై చెయ్యడానికి కూడా అధికారులు ఒక డేట్ ను ప్రకటిస్తారు. మొన్నటి వరకు కేసీఆర్ ప్రభుత్వం మీద యువతలో ఉన్న వ్యతిరేకత ఈ వరుస నోటిఫికెషన్స్ వల్ల తగ్గేలా ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.