నిబంధనలు ఉల్లంఘించిన అన్ని అంశాల్లో జగన్ రెడ్డికి కోర్టుల్లో చీవాట్లు పడ్డాయని ప్రతిపక్ష నేత, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు అన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కరోనా ఓ వైపు విలయతాండవం చేస్తూ సంశయాత్మకంగా తయారయిందని, ఆసుపత్రుల్లో ఆక్సిజన్ కొరతతో ప్రజల ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనికి తోడు బ్లాక్ ఫంగస్ వ్యాధి ప్రజల ప్రాణాలను హరిస్తోంది. ప్రజలందరూ ఆవేదనతో ఉంటే ప్రభుత్వం మాత్రం అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందన్నారు.
జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల గురించి హైకోర్టు తీర్పు ప్రభుత్వానికి చెంపపెట్టని, అలాంటి తీర్పులు ఎన్ని వచ్చినా, న్యాయస్థానాలు ఎన్ని మొట్టికాయలు వేసినా ప్రభుత్వంలో చలనం లేదని, ఎంపి రఘురామ కృష్ణంరాజు పోలీసు కస్టడీలో గాయపడ్డారని మిలటరీ ఆసుపత్రి నివేదికతో నిర్థారణ అయింది. ఆయనను సీఐడీ పోలీసులు కొట్టారనే ఆరోపణలకు బలం చేకూరింది. రాజకీయ దురుద్దేశాలతో పెట్టిన రాజద్రోహం కేసులో సుప్రీంకోర్టు రఘురామకు బెయిల్ మంజూరు చేసింది.

ఆనందయ్యను బెదిరించి కస్టడీలోకి తీసుకోవడం దుర్మార్గం

మాస్క్ అడిగిన పాపానికి డా. సుధాకర్ ను వేధించి మరణించేంత వరకు చిత్రహింసలు పెట్టారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో అనంతయ్య ఆయుర్వేదంతో కరోనాను కంట్రోల్ చేస్తానని ముందుకు వచ్చినప్పుడు ప్రభుత్వం ఆడిన నాటకాలు అంతా ఇంతా కాదని, ఆయుర్వేదం మందు ఎంత వరకు పని చేస్తుందో పరిశోధనలు చేయించాలి. అలా కాకుండా ఆనందయ్యను బెదిరించి, కస్టడీలోకి తీసుకోవడం దుర్మార్గం. ముఖ్యమంత్రి ఏది అనుకుంటే అది చెయ్యటం తప్ప.. ఏమీ చేతకాదు. ఆయుర్వేదం మెడిసిన్ మీద నిజ నిర్ధారణ జరగాలి. బాగా పని చేస్తే కేంద్రానికి చెప్పాలి. అలా కాకుండా కలెక్టర్ ఎవరు చెప్పడానికి అని వైసీపీ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా చేసుకుంటే పోతే ఎలా అని అన్నారు.
ఎన్నికల పోలింగ్ రోజు కంటే 4 వారాలకు ముందు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పెట్టాలని కోర్టు స్పష్టంగా చెప్పింది. సీఎస్ గా పని చేసిన వ్యక్తి రిటైర్డ్ అయిన తరువాత, మీ ఆఫీస్ లో అడ్వైజర్ గా పెట్టుకొని ఆ తరువాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ గా నియమించుకున్నారని, ఆమె పదవిని చేపట్టిన తరువాత ఎన్నికలకు వెళ్లడం కరెక్టు కాదని వర్ల రామయ్య వెళ్లి చెప్పినా పట్టించుకోలేదని, ఇవి ఇల్లీగల్ ఎలక్షన్స్ అని మేము ఎన్నికలను బహిష్కరించారని, కోర్టు ఇచ్చిన తీర్పులో పేజి.నం.73, 74 పేరా 2 ప్రకారం “even a common man who can read, write and understand the English language can easily find out the direction issued by the Supreme Court in the order. But, here the State Election Commissioner, who worked as Chief Secretary to the State being a senior most retired IAS Officer, could not understand the simple direction issued by the Hon’ble Supreme Court in right perspective, which creates doubt as to her suitability and fitness to the post of Election Commissioner.” ఇందులో ప్రభుత్వానికి అర్ధం కానిది ఏముంది? ఇది కూడా అర్ధం కాకుండా ఎన్నికలు ఎలా నిర్వహించారని హైకోర్టు ఎన్నికల కమీషన్ ను తప్పును ఎత్తిచూపిందని చంద్రబాబునాయుడు అన్నారు.

Stay on top of the game with the latest updates on Telugu latest news today! Experience the thrill of LIVE Telugu news updates like never before, only on Teluguonlinenews.com.

Mail

Published on మే 22, 2021 at 5:00 సా.